Viral Video: ప్రతిభకు వయసుతో పని ఏముంది.. బాలీవుడ్ హిట్ సాంగ్ కి ఓ రేంజ్ లో డ్యాన్స్.. మిథున్ ని మించి పోయాడుగా..

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి జరుగుతోంది. అతిథులంతా హాజరై మండపంలో కూర్చున్నారు. ఆ వేడుక‌లో 1982లో విడుద‌లైన డిస్కో డ్యాన్సర్ మూవీలోని జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా పాట ప్లే అవుతోంది

Viral Video: ప్రతిభకు వయసుతో పని ఏముంది.. బాలీవుడ్ హిట్ సాంగ్ కి ఓ రేంజ్ లో డ్యాన్స్..  మిథున్ ని మించి పోయాడుగా..
Dance Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Dec 27, 2022 | 3:32 PM

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో వయసుతో సంబంధంలేకుండా చేసే డాన్స్‌ వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. సాధారణంగా పెళ్లిళ్లలో చాలామంది వారిలోని ట్యాలెంట్‌ను బయటపెడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఓ పెళ్లి వేడుకలో అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌తో అక్కడి అతిథులనే కాదు, నెటిజన్ల మతికూడా పోగొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి జరుగుతోంది. అతిథులంతా హాజరై మండపంలో కూర్చున్నారు. ఆ వేడుక‌లో 1982లో విడుద‌లైన డిస్కో డ్యాన్సర్ మూవీలోని జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా పాట ప్లే అవుతోంది. ఆ పాట వినగానే అక్కడున్న ఓ మిడిల్‌ ఏజ్డ్‌ వ్యక్తి ఎంతో హుషారుగా డాన్స్‌ చేశాడు. అతను ఎంతో ఎనర్జిటిక్‌గా స్టెప్స్‌ వేశాడు. మ్యూజిక్‌కి తగ్గట్టుగా అతను వేస్తున్న స్టెప్స్‌కి అతిథులంతా ముగ్ధులైపోయారు. పక్కనున్న కొందరు ఆ వ్యక్తిని ఎంకరైజ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా ఈ వీడియో తాజాగా నెట్టింట తెగ వైర‌ల‌వుతోంది. రోహిత్ విశ్వాస్ అనే ఇన్‌స్టాగ్రాం యూజ‌ర్ ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా 20 వేలమందికి పైనే వీక్షించారు. చాలమంది వీడియోను లైక్‌ చేస్తూ.. ప్రశంసల కామెంట్లు కురిపించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..