TUI flight: జెట్‌ విమాన చక్రంలో మానవ మృతదేహం.. మృతదేహం గుర్తింపు కోసం అధికారులు ప్రయత్నాలు

డిసెంబరు 5, 2022 గాంబియా రాజధాని బంజుల్‌ నుంచి లండన్‌లోకి గాట్విక్ విమానాశ్రయానికి విమానం బయలు దేరింది. సరిగ్గా ఎయిర్‌ పోర్ట్‌లో ల్యాండ్ అయినప్పుడే ఈ దిగ్బ్రాంతికర ఘటనను గుర్తించారు అధికారులు.

TUI flight: జెట్‌ విమాన చక్రంలో మానవ మృతదేహం.. మృతదేహం గుర్తింపు కోసం అధికారులు ప్రయత్నాలు
Dead Body In Flight
Follow us

|

Updated on: Dec 25, 2022 | 12:34 PM

విమాన చక్రంలో మానవ మృతదేహం కలకలం సృష్టించింది. గాంబియా నుంచి బ్రిటన్‌కు వెళ్ళిన జెట్‌విమానంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం వీల్‌బేలో చనిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. టీయూఐ ఎయిర్‌వేస్ నడుపుతున్న జెట్‌ విమానంలో గుర్తుతెలియని ఒక నల్లజాతీయుడి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. డిసెంబరు 5, 2022 గాంబియా రాజధాని బంజుల్‌ నుంచి లండన్‌లోకి గాట్విక్ విమానాశ్రయానికి విమానం బయలు దేరింది. సరిగ్గా ఎయిర్‌ పోర్ట్‌లో ల్యాండ్ అయినప్పుడే ఈ దిగ్బ్రాంతికర ఘటనను గుర్తించారు అధికారులు. ఆ మేరకు బ్రిటన్ మెట్రో పోలీసులు గాంబియా ప్రభుత్వానికి ఈ సమాచారం అందించారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఒక అపరిచిత వ్యక్తి విమానం వీల్ బేలో మృతిచెందినట్టు తెలిపారు.

గాంబియన్ ప్రభుత్వ ప్రతినిధి ఎబ్రిమా ఆ మృతదేహాన్ని విమానం నుండి తీసివేసి వర్థింగ్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. గాంబియన్ అధికారులు బ్రిటీష్ పోలీసులతో సహకరిస్తున్నారని .. ఆ మృత దేహం ఎవరది అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వ్యక్తి గుర్తింపు కోసం అతని DNA ను పరీక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ