Winter Storm: ప్రపంచాన్ని వణికిస్తున్న చలి..లండన్, టిల్బరీ హైవేలో 100 పైగా వాహనాలకు ఆక్సిడెంట్.. 401రోడ్డు మూసివేత
హైవే 401లో దాదాపు 100 వాహనాలు పలు ప్రమాదాల్లో చిక్కుకున్నాయని.. దీంతో ఈ హైవే ని తాత్కాలికంగా మూసివేసినట్లు పేర్కొన్నారు. అయితే అదృష్టవశాత్తు కారిడార్‌లో బహుళ వాహనాలు ఢీ కొన్నా ఎటువంటి దారుణ ఘటన జరగలేదని.. ఎవరికి తీవ్ర గాయాలు కాలేదని అధికారులు చెప్పారు.
గత కొంతకాలంగా భారీ వర్షాలు,వ్ వరదలు ప్రపంచ దేశాలను వణికించగా.. ఇప్పుడు శీతల గాలులు, మంచు వంతు వచ్చింది. భారీగా కురుస్తున్న మంచుతో ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు వణికిపోతున్నారు. శీతల గాలులతో బయటకు రావాలన్నా భయపడుతున్నారు. తాజాగా ప్రావిన్స్‌ను శీతాకాలపు తుఫాన్ తాకింది. భారీగా మంచు వర్షం కురుస్తున్న కారణంగా కెనెడాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. లండన్, టిల్బరీ ల మధ్య హైవే 401 , 402 రెండింటిలోనూ పలు వాహనాలు ఢీకొన్నాయని అంటారియో ప్రావిన్షియల్ పోలీసు అధికారి కెర్రీ ష్మిత్ తెలిపారు. అంతేకాదు హైవే 401లో దాదాపు 100 వాహనాలు పలు ప్రమాదాల్లో చిక్కుకున్నాయని.. దీంతో ఈ హైవే ని తాత్కాలికంగా మూసివేసినట్లు పేర్కొన్నారు. అయితే అదృష్టవశాత్తు కారిడార్‌లో బహుళ వాహనాలు ఢీ కొన్నా ఎటువంటి దారుణ ఘటన జరగలేదని.. ఎవరికి తీవ్ర గాయాలు కాలేదని అధికారులు చెప్పారు. గాయపడిన ఇద్దరు వ్యక్తులను ఆస్పత్రికి తరలించినట్లు.. వారికీ ఎటువంటి ప్రాణపాయం లేదని స్పష్టం చేశారు.
WATCH: #BNNCanada Reports.
ఇవి కూడా చదవండిAround 100 vehicles were involved in multiple crashes on Highway 401 between London and Tilbury, Ontario Provincial Police said. #Highway401 #Tilbury #Ontario #London #CarCrash #Canada #Accident pic.twitter.com/gQGboQq61r
— Gurbaksh Singh Chahal (@gchahal) December 24, 2022
గ్రేటర్ టొరంటో ఏరియా వైపు శీతల గాలులు బలంగా వీస్తున్నాయని.. వీలైతే ప్రజలు రోడ్లమీదకు రావద్దని పోలీసు అధికారి విజ్ఞప్తి చేస్తున్నారు. వాహనాలను డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
దయచేసి.. ప్రజలకు రోడ్లపై ఉండాల్సిన అవసరం లేకుంటే.. ఇంట్లోనే ఉండమని.. ఈ పరిస్థితి నెమ్మదించే వరకూ వేచి చూడమని కోరుతున్నారు. రోడ్డు మీద పేరుకున్న మంచు ని శుభ్రం చేసే ప్రక్రియను వేగవంతం అయ్యేలా సహకరించాలని కెర్రీ ష్మిత్ కోరారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..