Trending News: పెళ్లైన రెండో రోజునే ఇల్లు ఊడావాలంటూ.. కొత్తకోడలికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన అత్తగారు.. అదేంటో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Dec 24, 2022 | 3:51 PM

అత్తగారు చెప్పిన మాట ప్రకారం వధువు ఉదయాన్నే నిద్రలేచి ఇళ్లు ఊడ్చేందుకు సిద్ధపడింది. కానీ, ఆమె గదిలో కనిపించిన దృశ్యం చూసి ఆమె కళ్లు బైర్లు కమ్మేసినంత పనైంది. గదిలో ఎటూ చూసినా నేలపై చెల్లాచెదురుగా పడివున్న

Trending News: పెళ్లైన రెండో రోజునే ఇల్లు ఊడావాలంటూ.. కొత్తకోడలికి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన అత్తగారు.. అదేంటో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..
Traditional Blessing
Follow us

కొత్త పెళ్లికూతురికి ఆశ్చర్యం కలిగించేంత సర్ ప్రైజ్ ఇచ్చింది అత్తగారు. అత్తగారిచ్చిన షాక్‌తో కొత్త కోడలు కోలుకోలేని ఆశ్చర్యంలో మునిగిపోయింది. పెళ్లయిన రెండు రోజులకు అత్తగారు వధువును తెల్లవారుజామున నిద్రలేచి గది ఊడ్చమని కోరింది. అత్తగారు చెప్పిన మాట ప్రకారం వధువు ఉదయాన్నే నిద్రలేచి ఇళ్లు ఊడ్చేందుకు సిద్ధపడింది. కానీ, ఆమె గదిలో కనిపించిన దృశ్యం చూసి ఆమె కళ్లు బైర్లు కమ్మేసినంత పనైంది. గదిలో ఎటూ చూసినా నేలపై చెల్లాచెదురుగా పడివున్న డబ్బు కనిపించింది.. ఏమీ అర్థంకానీ పరిస్థితిలో ఆ కోడలు వెంటనే అత్తగారిని ఆరా తీసింది. దానికి అత్తచెప్పిన సమాధానం ఏంటంటే..

Traditional Blessing 1

చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో జరిగింది ఈ వింత సంఘటన.ఇక్కడ, జు అనే పేరుగల నూతన వధువు.. పెళ్లయిన రెండు రోజుల తర్వాత తన గదిని శుభ్రం చేస్తుండగా, ఆమె గదిలో చెల్లా చెదురుగా పడివున్న చాలా నోట్లను గుర్తించింది. జును ఆమె అత్తగారు పొద్దున్నే లేచి తన బెడ్‌రూమ్‌ని ఊడ్చమని చెప్పారు. జు ఉదయం నిద్రలేచి గదిని శుభ్రం చేయడం ప్రారంభించినప్పుడు, ఆమె నేలపై చెల్లాచెదురుగా ఉన్న అనేక నోట్లను గుర్తించింది. అంత డబ్బు చూసి జు ఆలోచనలో పడింది. సావో ఫూ అనే సాంప్రదాయ పద్ధతిలో భాగంగా గదిలో నోట్లు చెల్లాచెదురుగా వేస్తారని ఆమె అత్తగారు చెప్పారు. ఆమె అత్తగారు ఈ నోట్లను వెదజల్లినట్టుగా తెలిసింది. సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నందుకు ఇలా చేశామని అత్తగారు చెప్పారు. ఈ ఆచారం ప్రకారం పెండ్లి అయిన మూడో రోజున వధువు కొత్త ఇంటిని ఊడ్చి డబ్బు వసూలు చేయాలి. దీని వల్ల పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు.

ఇంటిని ఊడ్చేందుకు ముందుగా, తన భర్తను నిద్రలేపి, వీడియో తీయమని అడిగింది జు. ఆ తర్వాత ఇల్లు ఊడుస్తూ జూ ఇలా అంటుంది.. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా పనిచేయలేద అంటుంది. ఇదంతా వీడియో తీసిన ఆమె భర్త..ఆ తర్వాత ఈ వీడియో చైనీస్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియోకి ఇప్పటివరకు 40 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu