Viral Video: మెట్రో రైలులో కునికిపాట్లు.. పక్కనే కూర్చున్న అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

Jyothi Gadda

Jyothi Gadda | Edited By: Anil kumar poka

Updated on: Dec 24, 2022 | 4:38 PM

రెండు వారాల క్రితం ఓ వ్యక్తి మెట్రో సీటుపై బెడ్‌షీట్‌ కప్పుకుని హాయిగా నిద్రిస్తున్న ఓ మెట్రో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇక్కడ ఒక యువకుడు

Viral Video: మెట్రో రైలులో కునికిపాట్లు.. పక్కనే కూర్చున్న అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Metro Look
Follow us

సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక మన దేశానికి సంబంధించిన వైరల్‌ వీడియోల విషయానికి వస్తే ఎక్కువగా పెళ్లిళ్లు,వివాహ వేడుకల్లో వధూవరులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, ఫన్నీ వీడియోలు, మెట్రోలో విచిత్రమైన పనులు చేస్తున్న వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇందులోనూ మెట్రోలో డ్యాన్స్‌లు, రీలింగ్ వీడియోలు మరింత వైరల్‌గా మారాయి. రెండు వారాల క్రితం ఓ వ్యక్తి మెట్రో సీటుపై బెడ్‌షీట్‌ కప్పుకుని హాయిగా నిద్రిస్తున్న ఓ మెట్రో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇక్కడ ఒక యువకుడు మెట్రోలో కూర్చొని నిద్రపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

మెట్రోలో ఒక్క సీటు కూడా ఖాళీ లేదని ఈ వైరల్ వీడియో చూస్తే అర్థం అవుతుంది. తలుపు పక్కన సీటు అంచున ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఆమె పక్కనే నీలిరంగు టీ షర్ట్ వేసుకున్న కుర్రాడు కూర్చున్నాడు. అతడు కూర్చొని నిద్రపోతున్నాడు. అతడు చాలా గాఢంగా నిద్రపోతున్నాడు. అతను నెమ్మదిగా సీటులోంచి కిందకు జారిపోతున్నాడు. గాఢమైన నిద్రలో అతడు కిందపడబోతుంటే..ఆ పక్కనే ఆకుపచ్చ టీ షర్ట్‌ ధరించి ఉన్న అతన్ని చూస్తుంది. ఆ యువకుడు సీటులోంచి కింద పడబోతుంటే, ఆమె అతని టీ షర్ట్ పట్టుకుని లాగి కిందపడకుండా కాపాడింది. అపరిచిత యువకుడికి ఓ అమ్మాయి సాయం చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ వైరల్ వీడియోను MD మొయిన్ షేక్ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. లక్షలాది మంది వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోకి ఫన్నీ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. గుర్తు తెలియని వ్యక్తికి సాయం చేసిన ఆ అమ్మాయిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు దీనిని స్క్రిప్ట్ వీడియో అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu