Viral Video: కంగారూ కదా అనుకుంటే.. కంగారు పెట్టించేసింది.. కింద పడేసి, కాళ్లతో తన్ని..
ప్రపంచంలో రకరకాల జంతువులు నివాసముంటున్నాయి. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవైతే.. మరికొన్ని ప్రశాంతంగా ఉంటాయి. అవి ఎవరికీ హాని చేయవు. అంతే కాకుండా అవి పెంపుడు జంతువులుగానూ...
ప్రపంచంలో రకరకాల జంతువులు నివాసముంటున్నాయి. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవైతే.. మరికొన్ని ప్రశాంతంగా ఉంటాయి. అవి ఎవరికీ హాని చేయవు. అంతే కాకుండా అవి పెంపుడు జంతువులుగానూ ఉన్నాయి. అయితే మనందరికీ కంగారులు తెలిసిందే. ఇవి కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి వీటిని చాలా వరకు ప్రత్యక్షంగా చూడలేం. రెండు కాళ్లతో అచ్చం మనుషుల్లా నడిచే ఇది చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తుంది. కానీ చాలా ప్రశాంతమైనది. ఇవి పూర్తి శాకాహార జీవులు. కేవలం గడ్డిని మాత్రమే తింటాయి. వాటికి అంత ఈజీగా కోపం రాదు. ఒకసారి వచ్చిందా వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టమైన పని. వాటికి ఎదురుగా ఎవరున్నా వారిపై దాడి చేస్తాయి. కాబట్టి వాటితోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియోలో.. ఒక వ్యక్తిని కంగారు వెంబడించడాన్ని చూడవచ్చు. అతను తీవ్రంగా పరిగెత్తడం ద్వారా అదుపు తప్పి కింద పడిపోతాడు. అప్పుడు కంగారు అతనిని కాళ్లతో తంతుంది. తీవ్ర ప్రయత్నాల తర్వాత లేచి నిలబడిన ఆ వ్యక్తి.. ఓ కర్ర సహాయంతో కంగారూను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తాడు. అయినా కంగారు ఏ మాత్రం వెనుక్కు తగ్గలేదు. ఈ వీడియో చూసిన తర్వాత కంగారూలు కూడా ప్రమాదకరమైన జంతువులు అనే భావన తప్పకుండా కలుగుతుంది.
Man gets “jumped” by a Kangaroo and fights back ??pic.twitter.com/nIXoqy28Pt
— Daily Loud (@DailyLoud) December 22, 2022
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ అవుతున్న ఈ వీడియో చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కేవలం 21 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 3.7 మిలియన్లు వ్యూస్, లక్షా 14 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. వీడియో చూసిన తర్వాత.. నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు. కంగారుకు, మనిషికి మధ్య జరిగిన ఈ పోరును చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు మాత్రం నవ్వుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..