Andhra Pradesh: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలోని ఆ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షాలు

రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలతో పాటు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీలో వాతావరణానికి సంబంధించి అమరావతి వాతావరణ కేంద్రం ప్రత్యేక సూచనలు జారీ చేసింది

Andhra Pradesh: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలోని ఆ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షాలు
Ap Rains
Follow us
Basha Shek

|

Updated on: Dec 24, 2022 | 2:06 PM

ఆంధ్రప్రదేశ్‌, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయుల్లో ఈశాన్య /తూర్పు దిశలో గాలులు వీస్తున్నాయి. దీంతో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా పశ్చిమ నైరుతి దిశగా గంటకు 13 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ ఈ రోజు 08. 30 గంటల కు ట్రింకోమలీ (శ్రీలంక)కి తూర్పు ఈశాన్యంగా 400 కిమీ దూరంలో, నాగపట్టినం తూర్పుగ 470 కిమీ (తమిళనాడు), చెన్నై (తమిళనాడు)కి తూర్పు ఆగ్నేయంగా 500 కి.మీ. సమీపంలో కేంద్రీకృతమవుతోంది. ఆతర్వాత పశ్చిమ నైరుతి దిశగా కదిలి 25 ఉదయం శ్రీలంక తీరానికి చేరుకుంటుంది, ఆపై శ్రీలంక మీదుగా పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ ఆదివారం (డిసెంబర్‌26) ఉదయం నాటికి కొమోరిన్ ప్రాంత పరిసర ప్రాంతాలకు చేరుకుంటుంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలతో పాటు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీలో వాతావరణానికి సంబంధించి అమరావతి వాతావరణ కేంద్రం ప్రత్యేక సూచనలు జారీ చేసింది. దీని ప్రకారం

రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం

శనివారం, ఆదివారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. సోమవారం: ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది

ఇవి కూడా చదవండి

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ శనివారం, ఆదివారం, సోమవారం: ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది

రాయలసీమ శనివారం: పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం: ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..