IND vs BAN: ఢాకాలో పంత్ సిక్సర్ల ధమాకా.. ఒంటిచేత్తోనే అలవోకగా స్టాండ్స్‌లోకి.. కానీ మళ్లీ సెంచరీ మిస్..
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ విజృంభించాడు. కేవలం 104 బంతుల్లోనే 93 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ విజృంభించాడు. కేవలం 104 బంతుల్లోనే 93 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. కానీ భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో మరోసారి సెంచరీని కోల్పోయాడు. మెహదీ హసన్ మిరాజ్ 93 పరుగుల వద్ద పంత్‌ను పెవిలియన్‌కు పంపాడు. కాగా పంత్ తొంభైల్లో అవుట్ కావడం ఏడాది మూడోసారి కాగా… మొత్తం మీద ఆరోసారి. అయితే ఉన్నంతసేపు బంగ్లా బౌలర్లను గడగడలాడించాడు రిషబ్. ముఖ్యంగా మూడో సెషన్‌లో బంగ్లా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. మొదట 49 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత దూకుడుగ ఆడాడు. టీ20 మ్యాచ్ తరహాలో చేలరేగిన పంత్ ఒంటిచేత్తో సిక్సర్లు కొట్టి టీమిండియా స్కోరును వేగంగా ముందుకు కదిలించాడు. ముఖ్యంగా 48వ ఓవర్లో అతను కొట్టిన102 మీటర్ల భారీ సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. తైజుల్ వేసిన ఆ ఓవర్ రెండో బంతిని మిడ్‌వికెట్ మీదుగా నేరుగా స్టాండ్స్‌లోకి పంపాడు పంత్. ఆతర్వాత షకీబ్ ఓవర్లోనూ మరో సిక్స్ కొట్టాడు. ఇలా ఉన్నంతసేప బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన పంత్ సెంచరీ చేస్తాడని అందరూ భావించారు. కానీ భారీ షాట్‌కు యత్నించి ఔటై ఫ్యాన్స్‌ను నిరాశపర్చాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 314 పరుగులకు ఆలౌటౌంది. పంత్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (87) రాణించాడు. అయితే వీరిద్దరు మినహా మరే బ్యాటర్లు పెద్దగా స్కోరు చేయలేదు. దీంతో భారత జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 87 పరుగుల స్పల్ప ఆధిక్యం లభించింది. బంగ్లా బౌలర్లలో షకీబ్, తైజుల్ ఇస్లామ్ చెరో 4 వికెట్లు పడగొట్టాడు.
Rishabh Pant in Tests this year:
68* (now) 46 57 146 50 39 96 100* 27 0 17#RishabhPant #BANvsIND #BANvIND #INDvBAN pic.twitter.com/w1d5sqrqqw
— Cric18? (@Criclav_18) December 23, 2022
Rishabh Pant hit a 100 meter long six with one hand. ? pic.twitter.com/GkmJLsccJx
— Siddhartha Patel? (@Siddhuu_94) December 23, 2022
ఐపీఎల్ లైవ్ యాక్షన్ లైవ్ ఇక్కడ వీక్షించండి