AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 Mini Auction: కొచ్చిలో ప్రారంభమైన ఐపీఎల్‌ మినీ వేలం.. ఆ స్టార్‌ ప్లేయర్ల కోసం పోటీ పడుతోన్న ఫ్రాంచైజీలు

ప్రముఖ వేలం నిర్వాహకుడు హ్యూ ఎడ్మీడ్స్ ఈ వేలం కోసం మరోసారి వచ్చారు. ఆడమ్స్ గత మెగా వేలంలో కూడా పాల్గొన్నాడు. కానీ దురదృష్టవశాత్తు వేలం ప్రారంభమైన కొద్ది సేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో భారత్‌కు చెందిన ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ చారు శర్మ వేలం ప్రక్రియను పూర్తి చేసారు.

IPL 2023 Mini Auction: కొచ్చిలో ప్రారంభమైన ఐపీఎల్‌ మినీ వేలం.. ఆ స్టార్‌ ప్లేయర్ల కోసం పోటీ పడుతోన్న ఫ్రాంచైజీలు
Ipl 2023 Auction
Basha Shek
|

Updated on: Dec 23, 2022 | 3:04 PM

Share

క్రికెట్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2023 మినీ వేలం ప్రారంభమైంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ టీంలను భర్తీ చేసేందుకు రంగంలోకి దిగారు. ఐపీఎల్ కొత్త చైర్మన్‌గా నియమితులైన అరుణ్ ధుమాల్ ఐపీఎల్‌ వేలం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా లీగ్‌కు సహకరించినందుకు స్పాన్సర్‌లు, ప్రసారకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా మినీ ఆక్షన్‌లో మొత్తం 405 మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే అందరి దృష్టి మాత్రం ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, సామ్ కరన్‌లపైనే ఉంది. ఇంగ్లండ్‌కి చెందిన ఈ ఆల్‌రౌండర్లిద్దరూ బిగ్ మ్యాచ్ విన్నర్లు. కరణ్ టీ20 ప్రపంచకప్ 2022లో బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. వీరిద్దరితో పాటు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ క్యామెరూన్ గ్రీన్‌ ను సొంతం చేసుకునేందుకు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు తెగ ఆసక్తి చూపిస్తున్నాయి. కాగా ప్రముఖ వేలం నిర్వాహకుడు హ్యూ ఎడ్మీడ్స్ ఈ వేలం కోసం మరోసారి వచ్చారు. ఆడమ్స్ గత మెగా వేలంలో కూడా పాల్గొన్నాడు. కానీ దురదృష్టవశాత్తు వేలం ప్రారంభమైన కొద్ది సేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో భారత్‌కు చెందిన ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ చారు శర్మ వేలం ప్రక్రియను పూర్తి చేసారు. టెస్ట్ ఆడే దేశాలతో పాటు నాలుగు అసోసియేట్ దేశాలు కూడా ఈ ఐపీఎల్ వేలంలో ఉన్నాయి. అసోసియేట్ దేశాల నుండి 119 మంది క్యాప్డ్ ప్లేయర్‌లు, 282 అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు మరియు 4 ప్లేయర్‌లు వేలంలో భాగం కానున్నారు.

కాగా ఐపీఎల్‌- 2023 మినీ వేలానికి ముందు బీసీసీఐ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు శుభవార్త అందించింది. కామెరూన్‌ గ్రీన్‌, బెన్‌ స్టోక్స్‌ వంటి స్టార్లు సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌కు చెందిన ఇతర ఆటగాళ్లు టోర్నీ మొత్తానికి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులు ధ్రువీకరించినట్లు వెల్లడించింది. కాగా మొదటి సెట్ లో న్యూజిలాండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేరు వేలంలో మొదటి స్థానంలో నిలిచింది. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో గుజరాత్ టైటాన్స్ బిడ్డింగ్ ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..