Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Revanth: బిగ్‌బాస్‌ విన్నర్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పిన భార్య.. బిడ్డను మొదటిసారి చూసి ఎమోషనలైన రేవంత్

షో ప్రారంభంలోనే బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచేది తానే అని ధీమా వ్యక్తం చేసిన రేవంత్ అనుకున్నట్లు గానే ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. కాగా బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉండగానే రేవంత్‌ తండ్రిగా ప్రమోషన్‌ పొందిన సంగతి తెలిసిందే.

Singer Revanth: బిగ్‌బాస్‌ విన్నర్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పిన భార్య.. బిడ్డను మొదటిసారి చూసి ఎమోషనలైన రేవంత్
Singer Revanth
Follow us
Basha Shek

|

Updated on: Dec 22, 2022 | 1:11 PM

అభిమానుల అంచనాలను, ఆశలను నిజం చేస్తూ బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 6 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు సింగర్‌ రేవంత్‌. తన గాత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకుల అభిమానం చూరగొన్న గాయకుడు బిగ్‌ బాస్‌ హౌస్‌లోనూ తన చాతుర్యం ప్రదర్శించాడు. హౌస్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచే తనదైన ఆటతీరు, మాటలతో ఫ్యాన్స్‌ను ఆకట్టకున్నాడు. ఓవైపు ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటుతూనే మరోవైపు కావాల్సినంత ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాడు. షో ప్రారంభంలోనే బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచేది తానే అని ధీమా వ్యక్తం చేసిన రేవంత్ అనుకున్నట్లు గానే ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. కాగా బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉండగానే రేవంత్‌ తండ్రిగా ప్రమోషన్‌ పొందిన సంగతి తెలిసిందే. అతని భార్య అన్విత పండంటి బిడ్డకు జన్మనించ్చింది. కానీ ఆ ఆనందకర క్షణాల్లో భార్య పక్కన లేనంటూ, బిడ్డను కళ్లారా చూసుకోలేకపోయానంటూ హౌస్‌లో కన్నీళ్లు పెట్టుకున్నాడీ స్టార్‌ సింగర్‌. అయితే ఎట్టకేలకు తన కూతురిని తొలిసారిగా చూసుకున్నాడు. ఓవైపు బిగ్‌బాస్‌ ట్రోఫీ.. మరోవైపు బిడ్డను చూసిన సంతోషం.. రేవంత్‌ ఆనందానికి అవధుల్లేవనే చెప్పుకోవాలి.

కాగా బిగ్‌బాస్‌ టైటిల్‌తో బయటకు వచ్చిన రేవంత్‌కు ఆయన సతీమణి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పింది. అంతేకాదు తన బిడ్డను కలుసుకునే క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలనుకుంది. అందుకే రేవంత్‌ కళ్లకు గంతలు కట్టి లోపలికి తీసుకెళ్లింది. పాప దగ్గరికి వెళ్లగానే కళ్ల గంతలు తీసి కూతురిని రేవంత్‌ చేతికి అందించింది. పాపను అపురూపంగా చేతిలోకి తీసుకున్న రేవంత్‌ ఎమోషనల్ అయిపోయాడు. బిడ్డను దగ్గరకు తీసుకుని మురిసిపోయాడు. ఆప్యాయంగా ముద్దుపెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో అతని ఫ్యాన్స్‌, నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ‘క్యూట్‌ వీడియో’, ‘అమేజింగ్‌’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ???? (@anvitha_gangaraju)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..