Tollywood: ఈ చిన్నోడు ఇప్పుడు బుల్లితెరపై సూపర్ స్టార్.. ఫాలోయింగ్ మాములుగా లేదండోయ్..

ప్రస్తుతం మీరు పైన ఫోటోలో చూస్తున్న ఆ చిన్నోడు కూడా ఆ సీరియల్ హీరోనే. బుల్లితెరపై సూపర్ స్టార్ అనుకోవచ్చు. అంతగా ఉంటుంది ఫ్యాన్ ఫాలోయింగ్. అతని నటనకు ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. గుర్తుపట్టండి. వాస్తవానికి అతను సెలబ్రెటీ కుటుంబానికి చెందినవారు. తన తండ్రి ప్రముఖ నటుడు. అలాగే అతని భార్య కూడా పలు సీరియల్లలో నటిస్తోంది. గుర్తుపట్టరా ? ..

Tollywood: ఈ చిన్నోడు ఇప్పుడు బుల్లితెరపై సూపర్ స్టార్.. ఫాలోయింగ్ మాములుగా లేదండోయ్..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 22, 2022 | 1:58 PM

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అందులో కొన్ని ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయి. అలాంటి ధారవాహికలలో నటించి తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్న నటీనటులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో అగ్రస్థానంలో దూసుకుపోతున్న సీరియల్స్ ఎక్కువగానే ఉన్నాయి. అందులో గత కొన్నేళ్లుగా ఓ సీరియల్ మాత్రం నెంబర్ వన్ గా కొనసాగుతుంది. ఇక అందులో నటిస్తోన్న నటీనటులు కూడా ఎక్కువగానే ఫాలోయింగ్ సంపాందించుకున్నారు. ప్రస్తుతం మీరు పైన ఫోటోలో చూస్తున్న ఆ చిన్నోడు కూడా ఆ సీరియల్ హీరోనే. బుల్లితెరపై సూపర్ స్టార్ అనుకోవచ్చు. అంతగా ఉంటుంది ఫ్యాన్ ఫాలోయింగ్. అతని నటనకు ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. గుర్తుపట్టండి. వాస్తవానికి అతను సెలబ్రెటీ కుటుంబానికి చెందినవారు. తన తండ్రి ప్రముఖ నటుడు. అలాగే అతని భార్య కూడా పలు సీరియల్లలో నటిస్తోంది. గుర్తుపట్టరా ? ..

క్యూట్ గా స్మైల్ ఇస్తున్న ఆ చిన్నోడు మరెవరో కాదండి.. బుల్లితెర స్టార్ హీరోగా మారిన నిరుపమ్ పరిటాల. చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చిన నిరుపమ్.. తన నటనతో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. కార్తీక్.. డాక్టర్ బాబు అంటే ఎవ్వరైనా ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఇతడిని బుల్లితెర శోభన్ బాబు అని కూడా పిలుచుకుంటారు.

ఇవి కూడా చదవండి

కార్తీక దీపం మాత్రమే కాకుండా.. హిట్లర్ గారి పెళ్లాం, ప్రేమ, కలవారి కోడలు, కాంచన గంగ వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. కొద్ది రోజులు కార్తీక దీపం సీరియల్ కు దూరంగా ఉన్నా నిరుపమ్ ఇప్పుడు తిరిగి కొనసాగుతున్నాడు. అతను మాత్రమే కాదు.. వంటలక్క.. అలియాస్ దీప సైతం సీరియల్లోకి వచ్చేసింది. ఇక నిరుపమ్ తన తొలి ధారావాహికలో కలిసి నటించిన సహనటి మంజులను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.