Shruti Haasan: ప్రియుడితో విడిపోయిన శ్రుతి హాసన్ ?.. ఆ ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిందా ?..

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య చిత్రంలో నటిస్తోంది శ్రుతి. అలాగే బాలయ్య, గోపిచంద్ కాంబోలో రాబోతున్న వీర సింహా రెడ్డి చిత్రంలోనూ కనిపించనుంది.

Shruti Haasan: ప్రియుడితో విడిపోయిన శ్రుతి హాసన్ ?.. ఆ ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిందా ?..
Shruti Haasan, Shantanu Haz
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 21, 2022 | 3:03 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలోని అగ్రకథానాయికలలో శ్రుతి హాసన్ ఒకరు. కమల్ హాసన్ నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. చాలా కాలం సినిమాలకు దూరంగా ఈ బ్యూటీ.. క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత వరుస ఆఫర్లతో మళ్లీ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. అయితే ఇటీవల శ్రుతికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. తన ప్రియుడు శాంతను హజారికతో ఆమె విడిపోయిందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇన్నిరోజులు ఈ వార్తలపై సైలెంట్ గా ఉన్న శ్రుతి.. తాజా సోషల్ మీడియా ఖాతాలో ఓ పిక్ షేర్ చేస్తూ… బ్రేకప్ వార్తలకు చెక్ పెట్టేసింది.

ఎప్పుడూ సోషల్ మిడీయాలో యాక్టివ్ గా ఉండే శ్రుతి.. తాజాగా తన ప్రియుడు శాంతను హజారికతో కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ.. నేను కోరుకునేది ఇదే అనే క్యాప్షన్ జోడించింది. దీంతో బ్రేక్ వార్తలకు చెక్ పడింది. తాజాగా ఓ మీడియా సంస్థతో శాంతను గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అతను తన బెస్ట్ ఫ్రెండ్ అని.. అతను అద్భుతమైన, ఎంతో ప్రతిభావంతుడైన వ్యక్తి, ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారని చెప్పుకొచ్చింది.

Shruti Haasan

Shruti Haasan

అలాగే.. నా జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడానికి ఇష్టపడతాను. మన భావాలను అందరితో పంచుకోవడానికి ఇదో చక్కటి వేదిక అని నేను భావిస్తాను నా జీవితంలో ఇది ఒక భాగం అని తెలిపింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య చిత్రంలో నటిస్తోంది శ్రుతి. అలాగే బాలయ్య, గోపిచంద్ కాంబోలో రాబోతున్న వీర సింహా రెడ్డి చిత్రంలోనూ కనిపించనుంది. ఇవే కాకుండా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం సలార్ సినిమాలోనూ శ్రుతి నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.