Ram Charan-Upasana: రామ్ చరణ్ ఇంట్లో క్రిస్మస్ సెలబ్రెషన్స్.. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి సందడి.. ఫోటోస్ వైరల్..

ఉపాసన, చరణ్ ఇచ్చిన స్పెషల్ పార్టీకి మెగా ప్యామిలీతోపాటు..అల్లు ఫ్యామిలీ కూడా సందడి చేసింది. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను చరణ్ సతీమణి ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. అందులో రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్,

Ram Charan-Upasana: రామ్ చరణ్ ఇంట్లో క్రిస్మస్ సెలబ్రెషన్స్.. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి సందడి.. ఫోటోస్ వైరల్..
Ram Charan, Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 21, 2022 | 2:39 PM

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. మరోవైపు టాలీవుడ్ సెలబ్రెటీస్ ఇంట్లో కూడా పండగా వాతావరణం వచ్చేసింది. డిసెంబర్ 25న క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా రామ్ చరణ్ ఇంట్లో సెలబ్రెషన్స్ షూరు చేశారు. ఉపాసన, చరణ్ ఇచ్చిన స్పెషల్ పార్టీకి మెగా ప్యామిలీతోపాటు..అల్లు ఫ్యామిలీ కూడా సందడి చేసింది. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను చరణ్ సతీమణి ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. అందులో రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక, మెగా డాటర్స్ సుష్మిత, శ్రీజ మిగతా ఇంటిసభ్యులు కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

చాలా కాలం తర్వాత మెగాఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీ ఒకే చోట కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇలా అందరూ కలిసి ఉన్న ఫోటోస్ చూసి చాలా రోజులు అయ్యిందని.. ఫ్రేమ్ చూసేందుకు కళ్లూ చాలడం లేదంటూ తమ ఆనందాన్ని తెలుపుతున్నారు. మరోవైపు రామ్ చరణ్.. ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న తరుణంలో మెగా కుటుంబానికి ఈ ఏడాది వేడుకలు మరింత స్పెషల్ గా మారాయి. ప్రస్తుతం మెగా హీరోస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో బిజీగా ఉండగా.. చరణ్.. పాన్ ఇండియా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పుష్ప 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.