Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rangamarthanda: ‘నేనొక నటుడ్ని.. అల్పసంతోషిని’.. మెగా కంఠం నుంచి మనసును కదిలించే షాయరీ

‘నేనొక నటుడ్ని’ అంటూ సాగే ఈ షాయరీని మెగాస్టార్‌ చిరంజీవి తన గళంతో ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా చెప్పారు. ఇళయరాజా మ్యూజిక్ అందించారు.

Rangamarthanda: 'నేనొక నటుడ్ని.. అల్పసంతోషిని'.. మెగా కంఠం నుంచి మనసును కదిలించే షాయరీ
Megastar Dr. Chiranjeevi
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 21, 2022 | 2:43 PM

– ‘నేనొక నటుడ్ని’ అంటూ ‘రంగమార్తాండ’ కోసం ‘షాయరీ’లో చిరంజీవి పలికించిన భావోద్వేగం వహ్వా అనిపిస్తోంది. అల్పసంతోషిని, దేవుడ్ని, జీవుడ్ని, నవ్విస్తా, ఏడిపిస్తా, ఆప్తుడిని, దాసుడిని అంటూ.. మెగాస్టార్ నోట వచ్చిన ఆ షాయరీకి తగ్గట్టు ఇళయరాజా సంగీతం కూడా భలే కుదిరింది. ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ రంగమార్తాండ సినిమాలో ‘షాయరీ’కు చిరంజీవి వాయిస్‌ ఇచ్చారు. యూట్యూబ్‌లో ఇలా విడుదలైందో లేదో అప్పుడే లైక్‌లు, షేర్‌లతో దూసుకెళ్తోంది.

— నేనొక నటుడ్ని అంటూ సాగిన మాటల మ్యాజిక్‌కి సంబంధించిన ఈ వీడియోలో.. చిరంజీవి ప్రస్థానాన్ని సందర్భోచితంగా చూపిస్తూ ప్రజెంట్ చేశారు. కృష్ణవంశీ డైరెక్షన్‌లో వస్తున్న రంగమార్తాండ మూవీకి ఇప్పుడు చిరు వాయిస్‌ అదనపు ఎట్రాక్షన్‌గా నిలిచింది. లక్ష్మీభూపాల అక్షరానికి, చిరంజీవి గాత్రం తోడై వచ్చిన ఈ షాయరీ ప్రశంసలు అందుకుంటోంది.

— మరాఠీలో అద్భుత విజయం సాధించిన నటసామ్రాట్ సినిమాకు రీమేక్‌గా రంగమార్తాండ వస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథలో మార్పులు చేశారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మనందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. హృదయానికి హత్తుకునేలా ఉన్న ఈ ‘షాయరీ’ని మీరు వింటూ చూసెయ్యండి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి