Nayanthara: ఎన్నాళ్లకెన్నాళ్లకు మీడియా ముందుకు లేడీ సూపర్ స్టార్.. కనెక్ట్ మూవీ ప్రమోషన్లలో నయన్ సందడి..

నయన్ మాత్రం చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించదు. ప్రాజెక్ట్ ఒప్పుకునే ముందే సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటానని నయన్ దర్శకనిర్మాతలకు కండీషన్ పెట్టేదట. ఇక ఇటీవల ఇద్దరు కవల పిల్లలకు తల్లైన తర్వాత మీడియా ముందుకు రాలేదు. తాజాగా చాలా కాలం తర్వాత తొలిసారి సినిమా ప్రమోషన్లలో సందడి చేసింది నయన్.

Nayanthara: ఎన్నాళ్లకెన్నాళ్లకు మీడియా ముందుకు లేడీ సూపర్ స్టార్.. కనెక్ట్ మూవీ ప్రమోషన్లలో నయన్ సందడి..
Nayanthara
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 21, 2022 | 2:17 PM

లేడీ సూపర్ స్టార్ నయనతారకు దక్షిణాదిలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుతోపాటు.. తమిళంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుంది. అయితే హీరోలకు పోటీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. మీడియా ముందుకు రావడం చాలా తక్కువ. ముఖ్యంగా సినిమా ప్రమోషన్లలో మాత్రం ఎక్కడా కనిపించదు. పెద్ద స్టార్ హీరో సరసన నటించినా.. భారీ బడ్జెట్ సినిమా అయినా సరే.. నయన్ మాత్రం చిత్ర ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించదు. ప్రాజెక్ట్ ఒప్పుకునే ముందే సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటానని నయన్ దర్శకనిర్మాతలకు కండీషన్ పెట్టేదట. ఇక ఇటీవల ఇద్దరు కవల పిల్లలకు తల్లైన తర్వాత మీడియా ముందుకు రాలేదు. తాజాగా చాలా కాలం తర్వాత తొలిసారి సినిమా ప్రమోషన్లలో సందడి చేసింది నయన్.

ఇక తాజాగా నయన్ తన తీరు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కనెక్ట్ మూవీ ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటుంది నయన్. ఇటీవల మీడియకు ప్రదర్శించిన కనెక్ట్ మూవీ ప్రివ్యూ షోకు నయన్ తన భర్త విఘ్నేష్ తో కలిసి హాజరైంది. అక్కడ హాలీవుడ్ నటిలా స్టైలిష్ గా కనిపించిన అమెను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో నయన్ ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఈ షోకు నయన్ వెళ్తుండగా.. ఓ అభిమాని ఐ లవ్ యూ మామ్ అని చెప్పగా.. నయన్ చిరునవ్వులు చిందించింది. ఇక మరికొందరు కనెక్ట్ చిత్రం బాగుందంటూ ప్రశంసలు కురిపించారు.

ప్రముఖ దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరకెక్కించిన కనెక్ట్ చిత్రంలో నయన్ ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ సినిమాను ఆమె భర్త విఘ్నేశ్ శివన్, రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. హార్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సత్యరాజ్, వినయ్ రాయ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?