Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: ప్రభాస్, తారక్, రవితేజలపై నయనతార ఆసక్తికర వ్యాఖ్యలు.. డార్లింగ్ మనసత్త్వం అలా ఉంటుందంటూ..

దాదాపు 10ఏళ్ల తర్వాత నయన్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చింది నయన్. అంతేకాదు.. టాలీవుడ్ స్టార్ హీరోస్ ప్రభాస్, తారక్, రవితేజ, బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

Nayanthara: ప్రభాస్, తారక్, రవితేజలపై నయనతార ఆసక్తికర వ్యాఖ్యలు.. డార్లింగ్ మనసత్త్వం అలా ఉంటుందంటూ..
Nayanthara, Prabhas, Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 21, 2022 | 4:12 PM

లేడీ సూపర్ స్టార్ నయనతార చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చింది. ఎప్పుడూ చిత్ర ప్రమోషన్లలో కనిపించని నయన్.. ఇప్పుడు తాను ప్రధాన పాత్రలో నటిస్తోన్న కనెక్ట్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా దాదాపు 10ఏళ్ల తర్వాత నయన్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చింది నయన్. అంతేకాదు.. టాలీవుడ్ స్టార్ హీరోస్ ప్రభాస్, తారక్, రవితేజ, బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

ప్రభాస్ గురించి చెప్పుకొస్తూ.. డార్లింగ్ చిన్న పిల్లొడి మనస్తత్వం అని.. షూటింగ్ సెట్ లో ఎంతో అల్లరి చేసేవాడని.. ప్రభాస్ అల్లరిని తట్టుకోవడం చాలా కష్టమని.. అంత అల్లరి పిల్లాడిగా ఉండే ప్రభాస్ ఇప్పుడు బాహుబలి, పాన్ ఇండియా స్టార్ అయ్యాడని.. అలా చూడడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక మాస్ మాహారాజా రవితేజ గురించి మాట్లాడుతూ.. మేమిద్దరం గుడ్ ఫ్రెండ్స్ అని.. సెట్ లో హిందీలో ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లమని.. హిందీ ఎంతో అనర్గళంగా మాట్లాడతాడని తెలిపింది.

అలాగే తారక్.. చాలా మంది హీరోలు రిహార్సల్స్ అవసరం లేకుండా డాన్స చేస్తామని చెప్పుకుంటారు. కానీ ఒకటీ రెండు సార్లయినా వాళ్లు రిహార్సల్స్ చేస్తుంటారు. కానీ ఎన్టీఆర్ అలా కాదు.. రిహాల్సర్స్ చేద్దామా అని అడిగితే. తనకి అవసరం లేదని అంటారు. డాన్స్ మాస్టర్ చేప్పడమే ఆలస్యం.. టేక్ కీ వెళ్లిపోదామని అంటారు. నిజంగా ఆయన చాలా టాలెంటెడ్ అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.