RRR Naatu Naatu Song: ఆర్ఆర్ఆర్‏కు మరో అంతర్జాతీయ గుర్తింపు.. ఆస్కార్ నామినేషన్స్ లో నాటు నాటు సాంగ్..

95వ ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌లో షార్ట్‌లిస్ట్‌ జాబితాలో ఆర్‌ఆర్‌ఆర్‌ చోటు దక్కించుకుంది. ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఈ మూవీలోని ‘నాటు నాటు’ పాట‌ చోటు సంపాదించుకుంది. దీంతోపాటు మరో భారతీయ సినిమా ‘ది లాస్ట్‌ ఫిల్మ్‌ షో’ బెస్ట్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్

RRR Naatu Naatu Song: ఆర్ఆర్ఆర్‏కు మరో అంతర్జాతీయ గుర్తింపు.. ఆస్కార్ నామినేషన్స్ లో నాటు నాటు సాంగ్..
Naatu Naatu Song
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 22, 2022 | 12:03 PM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకున్న ఈ మూవీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’లో సత్తా చాటేందుకు నాలుగు భారతీయ చిత్రాలు తొలి అడుగు వేశాయి. ఆస్కార్‌ అవార్డుల నామినేషన్స్‌లో పోటీ పడనున్న చిత్రాల షార్ట్‌లిస్ట్‌ను తాజాగా అకాడమీ ప్రకటించింది. ఇందులోని సుమారు 10 విభాగాలకు సంబంధించిన జాబితాలో నాలుగు విభాగాల్లో భారతీయ చిత్రాలు స్థానాలను దక్కించుకున్నాయి. 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌లో షార్ట్‌లిస్ట్‌ జాబితాలో ఆర్‌ఆర్‌ఆర్‌ చోటు దక్కించుకుంది. ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఈ మూవీలోని ‘నాటు నాటు’ పాట‌ చోటు సంపాదించుకుంది. దీంతోపాటు మరో భారతీయ సినిమా ‘ది లాస్ట్‌ ఫిల్మ్‌ షో’ బెస్ట్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్ విభాగంలో చోటు సంపాదించింది.

అలాగే ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ఆల్ దట్ బ్రీత్స్.. ఉత్తమ డాక్యుమెటంరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ది ఎలిఫెంట్ విష్పరర్ ఈ జాబితాలో చోటు సొంతం చేసుకున్నారు. షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఆ ఓటింగ్‌ను ఆధారంగా చేసుకుని జనవరి 24న ఆస్కార్ నామినేషన్‌లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. అనంతరం మార్చి 12న విజేతలకు ఆస్కార్‌ అవార్డులు అందించనున్నారు.

అయితే వీఎఫ్ఎక్స్‌, సౌండ్ డిజైనింగ్ విభాగాల్లో కూడా ట్రిపుల్ ఆర్ షార్ట్‌లిస్ట్‌కు ఎంపిక‌య్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జ‌రిగింది. ఇప్పటివరకు మన దేశానికి చెందిన ఏ సినిమాకు ఇందులో చాన్స్‌ దక్కలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.