Big Bash League: 3 ఓవర్లు..4 వికెట్లు.. హ్యాట్రిక్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపించిన యంగ్‌ ఫాస్ట్‌ బౌలర్‌

మంగళవారం రాత్రి భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మీడియం పేసర్ హీథర్ గ్రాహం హ్యాట్రిక్ సాధించగా, కొన్ని గంటల తర్వాత, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మైఖేల్ నీజర్ బిగ్ బాష్ లీగ్‌లో ఇలాంటి ఫీట్‌నే నమోదు చేశాడు.

Big Bash League: 3 ఓవర్లు..4 వికెట్లు.. హ్యాట్రిక్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపించిన యంగ్‌ ఫాస్ట్‌ బౌలర్‌
Michael Neser
Follow us
Basha Shek

|

Updated on: Dec 21, 2022 | 9:44 PM

ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఇది హ్యాట్రిక్ సీజన్‌గా కనిపిస్తోంది. దేశంలో లేదా విదేశాల్లో, మహిళా క్రికెటర్లు లేదా పురుషులు, అంతర్జాతీయ మ్యాచ్‌లు లేదా లీగ్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు హ్యాట్రిక్‌లు సాధిస్తున్నారు.మంగళవారం రాత్రి భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మీడియం పేసర్ హీథర్ గ్రాహం హ్యాట్రిక్ సాధించగా, కొన్ని గంటల తర్వాత, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మైఖేల్ నీజర్ బిగ్ బాష్ లీగ్‌లో ఇలాంటి ఫీట్‌నే నమోదు చేశాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 12వ సీజన్‌లో బుధవారం( డిసెంబర్‌21) న బ్రిస్బేన్ హీట్, మైన్‌బర్న్ రెనెగేడ్స్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ 8 వికెట్ల నష్టానికి కేవలం 137 పరుగులు చేసింది. టీ20ల్లో ఈ స్వల్ప స్కోరును కాపాడుకోవాలంటే బ్రిస్బేన్ బౌలర్ల నుండి మంచి ప్రదర్శన అవసరం. రెండ్రోజుల క్రితం వెస్టిండీస్‌తో జరిగిన డే-నైట్ టెస్టులో పింక్ బాల్‌తో ఆస్ట్రేలియా తరఫున అద్భుతాలు చేసిన నీసర్.. ఈ బాధ్యతను తీసుకున్నాడు.

మెల్‌బోర్న్ ఇన్నింగ్స్‌లోని తొలి బంతికే వికెట్ తీయడం ద్వారా రైట్ ఆర్మ్ పేసర్ తన జట్టుకు గొప్ప ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత అదే ఓవర్ చివరి బంతికి జేక్ ఫ్రేజర్ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. ఈ రెండు వికెట్లతో శుభారంభం పలికిన నీసర్‌ ఆ తర్వాత ఓవర్‌లో మరింత విజృంభించాడు. మూడో ఓవర్‌లో బౌలింగ్‌కు తిరిగి వచ్చిన నీసర్, మొదటి బంతికే నిక్ మాడిన్‌సన్‌ను అవుట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఆ తర్వాతి బంతికే జోనాథన్ వెల్స్‌ను బౌల్డ్‌ చేసి 4 వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడుక. కాగా ఈ మ్యాచ్‌లో తొలి రెండు ఓవర్లలోనే హ్యాట్రిక్‌ను పూర్తి చేసి ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించాడు నీసర్. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో ఇది 9వ హ్యాట్రిక్ కాగా, బీబీఎల్‌లో హ్యాట్రిక్ సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. నీసర్ విధ్వంసం కారణంగా మెల్‌బోర్న్ స్కోరు కేవలం 2.2 ఓవర్లలోనే 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..