Shocking Video: రోగికి మద్యం తాగించిన అంబులెన్స్ డ్రైవర్.. షాకింగ్‌ వీడియోపై మండిపడుతున్న నెటిజన్లు

ప్రమాదవశాత్తూ కాలు విరగొట్టుకుని అంబులెన్స్‌లో ఉన్న ఓ వ్యక్తికి డ్రైవర్ మద్యం తాగించాడు. ఆ తర్వాత అతనూ కొంచెము పుచ్చుకున్నాడు. ఒడిశాలోని జగత్‌సింహ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Shocking Video: రోగికి మద్యం తాగించిన అంబులెన్స్ డ్రైవర్.. షాకింగ్‌ వీడియోపై మండిపడుతున్న నెటిజన్లు
Ambulance Driver
Follow us
Basha Shek

|

Updated on: Dec 20, 2022 | 8:50 PM

సాధారణంగా గాయాల బారిన పడి అంబులెన్స్‌లో ఉన్న రోగికి తాగునీరు లేదా ఏవైనా ఫలహారాలు ఇస్తుంటారు. అయితే ఒడిశాలో మాత్రం విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ కాలు విరగొట్టుకుని అంబులెన్స్‌లో ఉన్న ఓ వ్యక్తికి డ్రైవర్ మద్యం తాగించాడు. ఆ తర్వాత అతనూ కొంచెము పుచ్చుకున్నాడు. ఒడిశాలోని జగత్‌సింహ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్క అంబులెన్స్ ఆపి డ్రైవర్, రోగి మద్యం తాగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తిర్టోల్ ప్రాంతంలోని కటక్ ప్యారడైజ్ రహదారిలో సాయంత్రం ఈ ఘటన జరిగింది. అంబులెన్స్‌లో పడుకున్న రోగికి డ్రైవర్ మద్యం పోస్తున్న దృశ్యాలు వీడియోలో సృష్టంగా కనిపిస్తున్నాయి. కెందుజార్ ప్రాంతానికి చెందిన నకులే దేహూరి అనే వ్యక్తి ప్యారడైజ్‌లో నివాసం ఉంటున్నాడు. చెట్టును నరుకుతూ ప్రమాదవశాత్తు అతను కిందపడ్డాడు. దీంతో అతని కాలు విరిగింది. చికిత్స నిమిత్తం కటక్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి అతనిని అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. రోడ్డు మధ్యలో అంబులెన్సను ఆపి రోగికి మద్యాన్ని తాగించాడు డ్రైవర్‌. అయితే అయితే సదరు బాధితుడు అడగడం వల్లే తాను మద్యం ఇచ్చానని అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు. అయితే అంబులెన్స్‌లో ఓ మహిళ, పిల్లాడు సైతం కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

కాగా ఈ వీడియోపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తన్నారు. ఇలాంటి ఘటనలను అడ్డుకోవడంలో పోలీసులు, రవాణా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలకు చెక్‌ పెట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపినట్లు ప్రాంతీయ రవాణా అధికారి నిర్మల్ కుమార్ మొహంతి తెలిపారు. ‘ఇలా నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులకు జైలు శిక్ష, జరిమానా విధించాలి. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 185 ప్రకారం, ఎవరైనా ఆల్కహాల్‌ తాగి డ్రైవింగ్ చేస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 2,000 జరిమానా లేదా రెండూ విధిస్తాం. అధికారికంగా ఫిర్యాదు అందిన తర్వాత ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..