AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T 20 Cricket: 35 బంతుల్లో తుపాన్‌..12 ఫోర్లు, 10 సిక్సర్లతో బౌలర్లపై వీరవిహారం..కట్‌ చేస్తే టీ20ల్లో వరల్డ్‌ రికార్డ్‌

సరిగ్గా ఐదేళ్ల క్రితం అనగా 2017లో డిసెంబర్‌ 22న టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు రోహిత్‌. అందుకే ఈరోజు హిట్‌మ్యాన్‌ కెరీర్‌లో ప్రత్యేకమైన రోజు.

T 20 Cricket: 35 బంతుల్లో తుపాన్‌..12 ఫోర్లు, 10 సిక్సర్లతో బౌలర్లపై వీరవిహారం..కట్‌ చేస్తే టీ20ల్లో వరల్డ్‌ రికార్డ్‌
T 20 Cricket
Basha Shek
|

Updated on: Dec 22, 2022 | 6:52 AM

Share

ప్రస్తుతం రోహిత్ శర్మ పెద్దగా పరుగులు సాధించలేకపోవచ్చు. కెప్టెన్‌గానూ నిరాశపపరచవచ్చు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతను ప్రపంచంలోనే గొప్ప బ్యాటర్‌ అని ఎవరూ కాదనలేరు. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్‌ సెంచరీల మొదలు హిట్‌మ్యాన్‌ బ్యాట్‌ నుంచి గతంలో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లు వచ్చాయి. సరిగ్గా ఐదేళ్ల క్రితం అనగా 2017లో డిసెంబర్‌ 22న టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు రోహిత్‌. అందుకే ఈరోజు హిట్‌మ్యాన్‌ కెరీర్‌లో ప్రత్యేకమైన రోజు. ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 43 బంతుల్లో 118 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. హిట్‌మ్యాన్‌ కెరీర్‌లో ఇది రెండో టీ20 సెంచరీ. కాగా ఇంటర్నేషనల్‌ టీ20 క్రికెట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉంది.

రోహిత్‌ సెంచరీ కారణంగా ఈ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల భారీస్కోరు చేసింది. కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్‌లో మెరిశారు. వీరిద్దరు 165 పరుగుల భాగస్వామ్యం అందించారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 172 పరుగులకే పరిమితమైంది. దీంతో 95 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌తో టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రోహిత్‌ నిలిచాడు. అదే ఏడాది బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా స్టార్‌ ప్లేయర్‌ డేవిడ్ మిల్లర్ కూడా 35 బంతుల్లో సెంచరీ సాధించాడు. రోహిత్ కంటే ముందు ఈ ఘనత సాధించాడు. అదే సమయంలో చెక్ రిపబ్లిక్ బ్యాట్స్‌మెన్ సుదేశ్ విక్రమశేఖర 2019 సంవత్సరంలో రోహిత్ మిల్లర్ రికార్డులను సమం చేశాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..