Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: రెండో టెస్టుకు టీమిండియా రెడీ.. ఎదురు చూస్తున్న రెండు రికార్డులు..

రెండో టెస్టుకు భారత జట్టు రెడీ అయింది. ఈ మ్యాచ్‌లోనూ బద్దలు కాడానికి రెండు రికార్డులు వేచి చూస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈరోజు నుంచి మిర్‌పుర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో..

IND vs BAN: రెండో టెస్టుకు టీమిండియా రెడీ.. ఎదురు చూస్తున్న రెండు రికార్డులు..
Ind Vs Ban
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 22, 2022 | 5:56 AM

రెండో టెస్టుకు భారత జట్టు రెడీ అయింది. ఈ మ్యాచ్‌లోనూ బద్దలు కాడానికి రెండు రికార్డులు వేచి చూస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈరోజు నుంచి మిర్‌పుర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. వేలికి గాయంతో తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్‌రోహిత్ శర్మ.. రెండో టెస్ట్‌కూ అందుబాటులో ఉండడు. దీంతో రెండో మ్యాచ్‌కూ కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు.

రోహిత్‌ వస్తే.. తొలి టెస్టులో విఫలమైన రాహుల్‌ను తప్పించడం ఖాయమని అంతా భావించారు. అయితే, రోహిత్ గైర్హాజరీతో కేఎల్‌ తన స్థానం దక్కించుకోగలిగాడు. ఇంకో 16 పరుగులు చేస్తే టెస్టు కెరీర్‌లో 8వేల పరుగులు చేసిన ఎనిమిదో భారత బ్యాటర్‌ అవుతాడు. మరోవైపు అశ్విన్‌ టెస్టుల్లో 3వేల పరుగులుకే రెండు రన్స్‌ దూరంలో ఉన్నాడు. టెస్టుల్లో 400కిపైగా వికెట్లు తీయడంతోపాటు మూడు వేల పరుగులను చేసిన కపిల్‌ దేవ్, షేన్ వార్న్, రిచర్డ్‌ హ్యాడ్లీ, షాన్‌ పొలాక్ సరసన చేరనున్నాడు.

టీమ్ ఇండియా:

కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు యాదవ్ ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.

బంగ్లాదేశ్ జట్టు:

జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిటెన్ దాస్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, యాసిర్ అలీ, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, నసుమ్ అహ్మద్, మహ్మదుల్ హసన్, పి. మోమినుల్ హక్, రెహ్మాన్ రాజా, తస్కిన్ అహ్మద్.

క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..