Big Bash League: రెండేళ్ల కూతురికి స్ట్రోక్.. భారంగా క్రికెట్ లీగ్ నుంచి తప్పుకున్న రోహిత్ టీమ్ మేట్
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్ టోర్నీ నుంచి ఇంగ్లండ్ స్టార్ బౌలర్ టైమల్ మిల్స్ అనూహ్యంగా తప్పుకున్నాడు. పెర్త్ స్కార్చర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతని రెండేళ్ల కూతురు స్ట్రోక్ బారిన పడడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మిల్స్ తెలిపాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్ టోర్నీ నుంచి ఇంగ్లండ్ స్టార్ బౌలర్ టైమల్ మిల్స్ అనూహ్యంగా తప్పుకున్నాడు. పెర్త్ స్కార్చర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతని రెండేళ్ల కూతురు స్ట్రోక్ బారిన పడడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మిల్స్ తెలిపాడు. ఈ సందర్భంగా భార్య, కూతురితో కలిసి నడుచుకుంటూ వెళుతున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మిల్స్..’ 11 రోజుల తర్వాత క్రిస్‌మస్ కోసం ఇలా ఇంటికి.. బిగ్‌బాస్ టోర్నీ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లేందుకు మేము ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాం. అయితే ఆ సమయంలోనే మా చిన్నారి కూతురికి పక్షవాతం (స్ట్రోక్) వచ్చింది. తన శరీరంలోని ఎడమభాగం పూర్తిగా అచేతన స్థితిలోకి వెళ్లింది. తను కోలుకోవడానికి ఇంకెంత సమయం పడుతుందోనని ఆందోళన చెందాం. అయితే, మా చిన్నారి దేవత.. కఠిన పరిస్థితులను తక్కువ సమయంలోనే అధిగమించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తనను తీసుకుని ఇంటికి వెళ్తున్నాం. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి ముందు తను ఎంత వేదన అనుభవించిందో మాకు తెలుసు. ఇప్పుడైతే మేము సంతోషంగానే ఉన్నాం. తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెటర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సహచర క్రికెటర్లు అతనికి ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా బిగ్‌బాష్ లీగ్ ఆడేందుకు టైమల్ మిల్స్ ఆస్ట్రేలియాకు వెళుతున్న సమయంలోనే ఎయిర్‌పోర్టులోనే అతని రెండున్నరేళ్ల కూతురికి స్ట్రోక్ వచ్చింది. ఈ సమయంలో తన కుటుంబంతోనే ఉండాలని మిల్స్ నిర్ణయించుకున్నాడు. అందుకే కష్టమైనా క్రికెట్ లీగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. 30 ఏళ్ల మిల్స్ ఈ సీజన్‌లో పెర్త్ స్కార్చర్స్ తరఫున ఆడాల్సి ఉంది. ఇప్పుడు అతని స్థానంలో డేవిడ్ పైన్ పెర్త్ తరపున ఆడనున్నాడు. కాగా ఇంగ్లండ్ జట్టు తరఫున పలు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మిల్స్ భారత క్రికెట్ అభిమానులకు కూడా సుపరిచితమే. ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా అతడిని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన సంగతి తెలిసందే. అయితే గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్ జట్టులోకి వచ్చాడు.
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..