IPL 2023: 27 మ్యాచ్‌ల్లో 492 రన్స్‌.. కట్‌ చేస్తే ఐపీఎల్‌ వేలం నుంచి ఔట్‌.. మినీ ఆక్షన్‌కు ముందే షాక్

క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్‌ 2023 వేలం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. అయితే అంతకు ముందే ఓ స్టార్‌ ఆటగాడు ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. వేలం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. అతనెవరో కాదు..ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అండ్‌ బ్యాటర్‌ బెన్ మెక్‌డెర్మో.

IPL 2023: 27 మ్యాచ్‌ల్లో 492 రన్స్‌.. కట్‌ చేస్తే ఐపీఎల్‌ వేలం నుంచి ఔట్‌.. మినీ ఆక్షన్‌కు ముందే షాక్
Ben Mcdermott
Follow us
Basha Shek

|

Updated on: Dec 23, 2022 | 2:32 PM

క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్‌ 2023 వేలం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. అయితే అంతకు ముందే ఓ స్టార్‌ ఆటగాడు ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. వేలం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. అతనెవరో కాదు..ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అండ్‌ బ్యాటర్‌ బెన్ మెక్‌డెర్మో. ఆటగాళ్ల వేలం ప్రారంభానికి కొన్ని గంటల ముందే అతను ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నాడు. బెన్ తర్వాత ఐపీఎల్‌2023 వేలంలో పాల్గొన్న ఆస్ట్రేలియా ఆటగాళ్ల జాబితాలో కూడా మార్పు జరిగింది. ఈ వేలం కోసం బెన్ మెక్‌డెర్మో తన ప్రాథమిక ధర రూ. 50 లక్షలుగా ఉంచుకున్నాడు. అయితే అతనిపై ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపడంలేదు. బహుశా అందుకేనేమో ముందుస్తుగానే ఐపీఎల్‌ వేలం నుంచి తప్పుకుని ఉంటాడని తెలుస్తోంది. ఐపీఎల్‌ మినీ వేలంలో మొత్తం 21 మంది ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు షార్ట్‌లిస్ట్ చేశారు. కానీ ఇప్పుడు మెక్‌డెర్మాట్ తప్పుకోవడంతో రేసులో కేవలం 20 మంది ఆటగాళ్లు మాత్రమే మిగిలారు. కాగా ఆస్ట్రేలియా తరపున, బెన్ మెక్‌డెర్మో వన్డేలు, టీ20లతో సహా మొత్తం 27 మ్యాచ్‌లు ఆడాడు. ఒక సెంచరీతో సహా మొత్తం 492 పరుగులు చేశాడు. ఇక 23 టీ 20 మ్యాచ్‌ల్లో 269 పరుగులు చేశాడు. వన్డేల్లో అతని స్ట్రైక్ రేట్ 80కుపైగానే ఉంది. అయితే పొట్టిఫార్మాట్‌లో మాత్రం 100 కంటే తక్కువగా ఉంది. అందుకే ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు అతనిపై ఆసక్తి చూపలేదు. రిష్‌ క్యాచ్‌ లీగ్‌ వేలం నుంచి అతను తప్పుకోవడానికి బహుశా ఇదే కారణం కావచ్చు.

కాగా ఐపీఎల్‌ మినీ వేలంలో ఇప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్ల జాబితాలో 20 మంది పేర్లు ఉన్నాయి. ఈ 20 మంది పేర్లలో కామెరూన్‌ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లీన్ రూ. 2 కోట్ల బేస్ ధరతో ఉన్నారు. జ్యే రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, రిలే మెరెడిత్, సీన్ అబాట్, నాథన్ కౌల్టర్ నైట్ బేస్ ధర 1.5 కోట్లు. ఆండ్రూ టై, మొజాయిక్ హెన్రిక్స్ బేస్ ధర కోటి రూపాయలు. డేనియల్ సామ్స్, జోష్ ఫిలిప్స్ మరియు డి’ఆర్సీ షార్ట్ బేస్ ధర రూ.75 లక్షలు. బెన్ ద్వార్షుయిస్, బిల్లీ స్టాన్‌లేక్ – బేస్ ధర రూ. 50 లక్షలు, లాన్స్ మోరిస్ – రూ. 30 లక్షలు, హేడెన్ కర్, జాక్ ప్రెస్‌విజ్‌లు, పీటర్ హాట్‌జోగ్లో, నాథన్ మెక్‌ఆండ్రూ బేస్ ధర రూ. 20 లక్షలు. మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ