Manish Pandey IPL 2023 Auction: పరుగులు చేయకున్నా కాసుల పంట.. మినీ వేలంలో భారీ ధర పలికిన మనీశ్ పాండే
Manish Pandey Auction Price: గత కొన్ని నెలలుగా పేలవమైన ఫామ్ తో సతమతమవుతున్నాడు మనీశ్ పాండే. ఇప్పటికే జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఈ యంగ్ ప్లేయర్ దేశవాళీ టోర్నీల్లోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితేనేం ఐపీఎల్ మినీ వేలంలో మాత్రం భారీ ధరకు అమ్ముడుపోయాడు
Manish Pandey Auction Price: గత కొన్ని నెలలుగా పేలవమైన ఫామ్ తో సతమతమవుతున్నాడు మనీశ్ పాండే. ఇప్పటికే జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఈ యంగ్ ప్లేయర్ దేశవాళీ టోర్నీల్లోనూ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితేనేం ఐపీఎల్ మినీ వేలంలో మాత్రం భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులో మనీష్ పాండేను చేర్చుకుంది. ప్రస్తుతంకోటి ప్రాథమిక ధర ఉన్న అతనిని ఏకంగా రూ.2.4 కోట్లకు అతనిని కొనుగోలు చేసింది. 33 ఏళ్ల మనీష్ పాండే కుడిచేతి వాటం బ్యాటర్. టాప్ ఆర్డర్‌లో చెలరేగి ఆడే ట్యాలెంట్ ఉంది. అతను 2008 తొలి ఎడిషన్ నుండి IPL లో ఆడుతున్నాడు. చాలాసార్లు మెరుపు ఇన్నింగ్స్‌లతో తన జట్లకు విజయాలు అందించాడు. ఇప్పటివరకు మొత్తం 160 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు మనీశ్. 29.90 సగటుతో 3648 పరుగులు చేశాడు. IPLలో అతని స్ట్రైక్ రేట్ 121.52 . ఖాతాలో సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. ఇదే క్రమంలో భారత జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. మొదట్లోనే బాగానే రాణించినా ఆ తర్వాత ఫామ్ కోల్పోయాడు. పెద్దగా పరుగులు చేయకపోవడంతో జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.
కాగా గత సీజన్‌లో, పాండే లక్నో సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగాడు మనీశ్ . మొత్తం 6 మ్యాచుల్లో కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు. 38 పరుగులు టాప్ స్కోర్. ఈ ఫ్లాప్ షో కారణంగా జట్టు లక్నో మనీశ్‌ను వదిలేసింది. అయితే ఐపీఎల్‌లో అతని రికార్డులు, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మరోసారి అతనిపై నమ్మకం ఉంచింది ఢిల్లీ. అందుకే ఏకంగా 2.4 కోట్లకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ లైవ్ యాక్షన్ లైవ్ ఇక్కడ వీక్షించండి