IPL 2023 Auction: కోహ్లి టీంమేట్‌కు అదిరిపోయే ఆఫర్.. వేలంలో కాసుల వర్షం.. ఆ తెలుగు తేజం ఎవరో తెలుసా?
Kona Srikar Bharat Auction Price: 2015లో ఢిల్లీ క్యాపిటల్స్ కేఎస్ భరత్‌ను కొనుగోలు చేసింది. అయితే, ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక 2021లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 10 లక్షలకు దక్కించుకుంది.
KS Bharat: కొచ్చిలో జరుగుతోన్న ఐపీఎల్ మినీ వేలంలో చాలామంది ప్లేయర్ల తలరాతలు మారాయి. అలాగే కొందరికి మాత్రం బ్యాడ్ లక్ వెంటాడింది. ఇక తెలుగువాడైన శ్రీకర్ భరత్ మాత్రం భారీ ప్రైజ్ దక్కింది. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ తరపున బరిలోకి దిగనున్న ఈ తెలుగు తేజం.. రూ. 1.20కోట్లకు అమ్ముడయ్యాడు. దీంతో ఊహించని ధరను పొంది షాకిచ్చాడు.
తెలుగు తేజం కెరీర్..
కేఎస్ భరత్‌గా మారిన ఈ యంగ్ ప్లేయర్ అసలు పేరు కోనా శ్రీకర్ భరత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం గ్రామంలో అక్టోబర్ 3న, 1993లో జన్మించాడు. క్రికెట్‌పై ప్రేమతో.. దాన్నే కెరీర్‌గా మలుచుకున్నాడు. ఈ క్రమంలో 2012లో తొలిసారిగా ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. కెరీర్ తొలి నాళ్లలో ఈ యంగ్ ప్లేయర్ బ్యాటర్‌గానే ఉన్నాడు. అనంతరం ఆయన కోచ్ సూచనలతో కీపర్‌గానూ మారాడు.
ఇక 2015లో ఆంధ్రా జట్టు తరపున రంజీ ట్రోఫీలో సత్తా చాటాడు. అదే ఏడాది ట్రిపుల్ సెంచరీతో దుమ్మురేపి, క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. దీంతో రంజీ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ కం బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
కేఎస్ భరత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌ను పరిశీలస్తే.. 69 మ్యాచ్‌లు ఆడిన ఈ ప్లేయర్ 3909 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. 8 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు బాదేశాడు
టీమిండియాలో చోటు..
కేఎస్ భరత్ 2019లో టీమిండియాకు ఎంపికయ్యాడు. టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న తెలుగు తేజం.. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లాడు. కానీ, డెబ్యూ మ్యాచ్ ఇంత వరకు ఆడలేదు.
ఐపీఎల్ కెరీర్..
2015లో ఢిల్లీ క్యాపిటల్స్ కేఎస్ భరత్‌ను కొనుగోలు చేసింది. అయితే, ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక 2021లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 10 లక్షలకు దక్కించుకుంది. ఈసారి మాత్రం అవకాశం రావడంతో మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఆ సమయంలో కేవలం 52 బంతుల్లో 78 పరుగులు చేసి.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్ ఆడాడు. దీంతో హీరోగా పేరుగాంచి, కెప్టెన్ కోహ్లీ మనసు గెలుచుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..