- Telugu News Photo Gallery Cricket photos Ipl 2023 auction england player sam curran becomes the most expensive player ever to be bought in ipl history
IPL 2023 Auction: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ధోనీ మాజీ శిష్యుడు.. అసలు కారణం అదేనా?
Sam Curran: పంజాబ్ కింగ్స్ సామ్ కరణ్‌ను రూ. 18.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది అతని ప్రాథమిక ధర రూ. 2 కోట్ల కంటే 9 రెట్టు ఎక్కువ.
Updated on: Dec 23, 2022 | 5:13 PM

ఐపీఎల్ పిచ్‌పై చెన్నై సూపర్ కింగ్స్‌కు సామ్ కరణ్ ట్రంప్ కార్డ్‌గా నిరూపించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జెర్సీ ధరించి బ్యాటింగ్ చేయనున్నాడు. ఎందుకంటే, ఐపీఎల్‌కు చెందిన ఈ ఫ్రాంచైజీ రికార్డు స్థాయిలో ఖర్చు చేసి, ఈ ఇంగ్లండ్ ఆల్ రౌండర్‌ను దక్కించుకుంది. పంజాబ్ కింగ్స్ సామ్ కరణ్‌ను రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది అతని ప్రాథమిక ధర రూ. 2 కోట్ల కంటే దాదాపు 9 రెట్లు ఎక్కువ. అలాగే, ఇంతకుముందు అత్యధికంగా అమ్ముడైన ఆటగాడి రికార్డు కంటే ఈ మొత్తం రూ.2 కోట్లు ఎక్కువ కావడం విశేషం.

సామ్ కరణ్ కోసం పంజాబ్ కింగ్స్ అంత డబ్బు ఖర్చు చేసిందంటే, అది అతని ఆల్ రౌండ్ ఆట వల్లనే. కరణ్ బంతితో పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే బ్యాట్‌తోనూ అద్భుతాలు చేసి మ్యాచ్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

పవర్‌ప్లే, డెత్ ఓవర్‌లలో బౌలింగ్ చేయడం సామ్ కరణ్ మరో స్పెషల్. చెన్నై తరఫున ఐపీఎల్ పిచ్‌పై ఈ ఘనత సాధించి విజయం కూడా సాధించాడు. ఆ క్వాలిటీ ఆధారంగానే పంజాబ్ కింగ్స్ అతడిని ఎంపిక చేసుకుంది.

సామ్ కరణ్‌కు మొత్తం 145 టీ20లు ఆడిన అనుభవం ఉంది. ఇందులో 149 వికెట్లు పడగొట్టాడు. బంతితో అద్భుతాలు చేయడంతో పాటు మిడిలార్డర్‌లో అతను జట్టుకు మంచి బ్యాటింగ్ ఎంపిక. మ్యాచ్‌లను ముగించే సత్తా అతనికి ఉంది.

సామ్ కరణ్‌కి ఐపీఎల్‌లో మంచి అనుభవం ఉంది. ఇక్కడ 32 మ్యాచ్‌ల్లో 32 వికెట్లు తీశాడు. ఐపీఎల్ పిచ్‌పై బాల్‌తో 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అక్కడ అతను బ్యాట్‌తో 2 అర్ధ సెంచరీలు సాధించాడు.





























