- Telugu News Photo Gallery Cricket photos Most expensive Indian players IPL 2023 Auction Mayank Agarwal Mukesh Kumar Manish Pandey
IPL 2023 Auction: మినీ వేలంలో నక్క తోక తొక్కిన భారత ఆటగాళ్లు.. భారీ ధర పలికిన టాప్-5 ప్లేయర్స్ వీరే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మినీ వేలంలో విదేశీ ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగింది. అదే సమయంలో భారత ఆటగాళ్లపైనా కాసుల వర్షం కురిసింది. మరి ఇప్పటివరకు ఈ మినీ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 టీమిండియా ఆటగాళ్లెవరో చూద్దాం రండి.
Updated on: Dec 23, 2022 | 7:59 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మినీ వేలంలో విదేశీ ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగింది. అదే సమయంలో భారత ఆటగాళ్లపైనా కాసుల వర్షం కురిసింది. మరి ఇప్పటివరకు ఈ మినీ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 టీమిండియా ఆటగాళ్లెవరో చూద్దాం రండి.

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడనున్నాడు. 8.25 కోట్లకు సన్‌రైజర్స్ ఈ ఆటగాడిని కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన భారత ఆటగాడు అతనే.

అతని తర్వాత ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి. అతనిని గుజరాత్ టైటాన్స్ రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో మావి కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు.

మరో భారత ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ కూడా భారీ ధర పలికాడు. అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ.5.50 కోట్లు వెచ్చించింది.

వివ్రాంత్ శర్మను సన్‌రైజర్స్ హైదరాబాద్ 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్‌ను దక్కించుకునేందుకు కోల్‌కతా కూడా తీవ్రంగా ప్రయత్నించింది.

ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించిన భారత ఆటగాడు మనీష్ పాండే పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2.40 కోట్లతో అతనిని కోనుగోలు చేసింది.





























