IND vs BAN: పిలిచినా రానంటావా? కూల్‌గా ఉండే కోహ్లీకి కోపం తెప్పించిన పంత్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

వికెట్ కీపర్‌ రిషబ్‌ పంత్‌ (93), శ్రేయస్‌ అయ్యర్‌ (87)ల భారీ భాగస్వామ్యంతో భారత జట్టు కోలుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 150కు పరుగులు జోడించారు.

IND vs BAN: పిలిచినా రానంటావా? కూల్‌గా ఉండే కోహ్లీకి కోపం తెప్పించిన పంత్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Rishabh, Kohli
Follow us

|

Updated on: Dec 23, 2022 | 7:00 PM

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు భారీ ఆధిక్యం సంపాదించే అవకాశం కోల్పోయింది. ఆతిథ్య జట్టును మొదటి ఇన్నింగ్స్ లో 227 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా బ్యాటింగ్‌ లో మాత్రం పెద్దగా రాణించలేదు. శుక్రవారం (డిసెంబర్‌22) నాటి రెండో రోజు ఆటలో ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(10), శుబ్‌మన్‌ గిల్‌(20) ఆరంభంలోనే పెవిలియన్‌ చేరారు. ఆ తర్వాత వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఛతేశ్వర్‌ పుజారా(24), విరాట్ కోహ్లీ (24)కూడా తక్కువ స్కోరుకే అవుట్‌ అయ్యారు. అయితే వికెట్ కీపర్‌ రిషబ్‌ పంత్‌ (93), శ్రేయస్‌ అయ్యర్‌ (87)ల భారీ భాగస్వామ్యంతో భారత జట్టు కోలుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 150కు పరుగులు జోడించారు. అయితే ఈ జోడీ అవుటైన తర్వాత భారత జట్టు కుప్పకూలింది. అక్షర్‌ (4), అశ్విన్‌ (12), ఉనాద్కత్‌ (14), ఉమేశ్‌ (14), సిరాజ్‌ (7) వెంట వెంటనే ఔట్‌ కావడంతో మొదటి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకే పరిమితమైంది. తద్వారా కీలకమైన 87 పరుగుల ఆధిక్యం సంపాదించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

పుజారా అవుటైన తర్వాత బరిలోకి దిగిన రిషబ్‌ పంత్‌ అప్పటికే క్రీజులో ఉన్న కోహ్లితో కలిసి ఆచితూచి ఆడాడు. ఇద్దరూ సమన్వయంతో వేగంగా పరుగులు సాధించారు. అయితే లంచ్‌ బ్రేక్‌కు ముందు 36వ ఓవర్‌ చివరి బంతికి మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో కోహ్లి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే బంతి నేరుగా ఫీల్డర్‌ దగ్గరకు వెళ్లిపోయింది. రనౌట్‌ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పంత్‌.. క్రీజు నుంచి కదల్లేదు. అయితే అప్పటికే క్రీజును దాటి బయటకు వచ్చేశాడు కోహ్లీ. అయితే పంత్ రావొద్దని సైగ చేయడంతో వెంటనే వెనక్కు డైవ్‌ చేసి క్రీజులోకి వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తూ రనౌట్‌ తప్పించుకున్నాడు. అయితే వెనక్కు పంపించినందుకు కోపమొచ్చిందేమో పంత్‌పై గుడ్లు ఉరిమి చూశాడు కోహ్లీ. అయితే పంత్‌ మాత్రం కూల్‌గానే ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కాగా ఇది జరిగిన కొద్ది సేపటికే టస్కిన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో విరాట్‌ (24) అవుటయ్యాడు. అయితే పంత్‌ మాత్రం చెలరేగిపోయాడు. శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ పంత్‌కు సపోర్టు ఇస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘ పంత్‌ సరైన నిర్ణయం తీసుకున్నాడు. పంత్‌.. కోహ్లి మాట విని ఉంటే టీమిండియా పరిస్థితి ఏమయ్యేదో?’ అంటూ టీమిండియా వికెట్‌ కీపర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా 87 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్‌ రెండో రోజు ఆటముగిసే సమయానికి 6 ఓవర్లలో 7 పరుగులు చేసింది. నజ్మూల్ హుస్సేన్‌ శాంటో (5), జకీర్‌ హుస్సేన్‌ (2) క్రీజులో ఉన్నారు. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఫోన్‌ చోరీకి గురైందా..? ముఖ్యమైన ఈ మూడు పనులు వెంటనే చేయండి
ఫోన్‌ చోరీకి గురైందా..? ముఖ్యమైన ఈ మూడు పనులు వెంటనే చేయండి
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?
కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఈ కామెంట్స్ అంతరార్థం
కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఈ కామెంట్స్ అంతరార్థం
టీమిండియాతో అమెరికాకు ఎంఎస్ ధోని.. షాకింగ్ న్యూస్ చెప్పిన రోహిత్
టీమిండియాతో అమెరికాకు ఎంఎస్ ధోని.. షాకింగ్ న్యూస్ చెప్పిన రోహిత్
బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం..
బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం..
పోలింగ్ ను బహిష్కరించిన గ్రామస్తులు.. కారణం ఇదేనంటూ ఓటర్ల ఆగ్రహం
పోలింగ్ ను బహిష్కరించిన గ్రామస్తులు.. కారణం ఇదేనంటూ ఓటర్ల ఆగ్రహం
2 బంతుల్లోనే ఖతం.. కట్‌చేస్తే.. టిక్కెట్ డబ్బులివ్వని పీసీబీ
2 బంతుల్లోనే ఖతం.. కట్‌చేస్తే.. టిక్కెట్ డబ్బులివ్వని పీసీబీ
టీడీపీలో ఆ సీట్లు మార్పున‌కు నిర్ణ‌యం.. బీ ఫారంలు అందజేత అప్పుడే
టీడీపీలో ఆ సీట్లు మార్పున‌కు నిర్ణ‌యం.. బీ ఫారంలు అందజేత అప్పుడే
ఆల్కహాల్‌ ఒక్కటే కాదు.. ఇవి కూడా లివర్‌ను పాడు చేస్తాయి
ఆల్కహాల్‌ ఒక్కటే కాదు.. ఇవి కూడా లివర్‌ను పాడు చేస్తాయి
స్కాట్లాండ్‌లో నీటిలో మునిగి ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి..
స్కాట్లాండ్‌లో నీటిలో మునిగి ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు