ధోని నుంచి కర్రన్ వరకు.. ఐపీఎల్ చరిత్రలో కాస్ట్లీ ప్లేయర్స్ వీరే.. లిస్టులో 7గురు టీమిండియా ఆటగాళ్లు..

ఐపీఎల్ 2023 మినీ ఆక్షన్‌లో ఫ్రాంచైజీల ఊపు మాములుగా లేదుగా. భవిష్యత్తు సీజన్లను దృష్టిలో పెట్టుకుని యువ ప్లేయర్స్‌పై కాసులు వర్షం కురిపిస్తున్నారు.

ధోని నుంచి కర్రన్ వరకు.. ఐపీఎల్ చరిత్రలో కాస్ట్లీ ప్లేయర్స్ వీరే.. లిస్టులో 7గురు టీమిండియా ఆటగాళ్లు..
Ipl 2023 Auction
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 23, 2022 | 10:28 PM

ఐపీఎల్ 2023 మినీ ఆక్షన్‌లో ఫ్రాంచైజీల ఊపు మాములుగా లేదుగా. భవిష్యత్తు సీజన్లను దృష్టిలో పెట్టుకుని యువ ప్లేయర్స్‌పై కాసులు వర్షం కురిపిస్తున్నారు. అలాగే అనుభవం ఉన్న సీనియర్లను వారిని తీర్చిదిద్దేందుకు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలో రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ఇప్పటిదాకా అత్యధిక ధర ప్లేయర్స్ లిస్టులో అగ్రస్థానంలో నిలిచిన కెఎల్ రాహుల్(రూ. 17 కోట్లు), విరాట్ కోహ్లి(రూ. 17 కోట్లు) ఉన్నారు. ఇక ఇప్పుడు వారిని అధిగమించి ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్(రూ.18.5 కోట్లు) టాప్ ప్లేస్‌కు చేరాడు. ఒక్క అతడే కాదు.. వరల్డ్ కప్ విన్నర్స్ మరో ఇద్దరు కూడా భలే ధర పలికారు. మరి అసలు ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూసేద్దాం.

  • సామ్ కర్రన్:

ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్‌ నక్క తోక తొక్కాడని చెప్పొచ్చు. మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇతడ్ని పంజాబ్ కింగ్స్ రూ. 18.5 కోట్లకు దక్కించుకుంది. ఇక ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. ఇప్పటిదాకా 32 మ్యాచ్‌లు ఆడిన కర్రన్ బ్యాట్‌తో 337 పరుగులు, బంతితో 41 వికెట్లు సాధించాడు.

  • కామెరాన్ గ్రీన్:

ఈ ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్‌కు అంతర్జాతీయ అనుభవం తక్కువే. అలాగే ఇప్పటిదాకా ఐపీఎల్‌ కూడా ఆడలేదు. అయితేనేం ఈ సంవత్సరం అతడు ఆడిన కొన్ని టీ20 మ్యాచ్‌ల్లోని విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఫ్రాంచైజీలను ఆకర్షించాయి. అంతే! మినీ వేలంలో కాసుల వర్షం కురిపించారు. కామెరాన్ గ్రీన్‌ను రూ. 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. దెబ్బకు ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.

  • బెన్ స్టోక్స్:

ఈ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్.. తన జట్టుకు టీ20 వరల్డ్‌కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఫామ్ బట్టి మినీ వేలంలో అత్యధిక ధర పలుకుతాడని అందరూ అనుకున్నారు. సరిగ్గా అదే నిజమైంది. చెన్నై సూపర్ కింగ్స్ రూ. 16.25 కోట్లకు బెన్ స్టోక్స్‌ను దక్కించుకుంది. అలాగే స్టోక్స్ 2024లో ధోని వారసుడిగా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే అవకాశం కూడా ఉంది. ఈ రేటుతో స్టోక్స్ ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు.

  • క్రిస్ మోరిస్:

ఈ దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ 2021 మెగా ఆక్షన్‌లో అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు. ఆ సమయంలో రాజస్తాన్ రాయల్స్ రూ. 16.25 కోట్లకు మోరిస్‌ను దక్కించుకుంది. అయితే అతడు మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబరచలేదు. మోరిస్ ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధర పలికిన నాలుగో ఆటగాడు.

  • నికోలస్ పూరన్:

ఈ మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్.. 15వ ఎడిషన్ ఐపీఎల్‌లో విఫలమయ్యాడు. అలాగే టీ20 వరల్డ్‌కప్‌లోనూ తుస్సుమనిపించాడు. అయితేనేం.. ఈసారి జరిగిన మినీ వేలంలో మరోసారి తన సత్తా చాటి అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ రూ. 16 కోట్లకు పూరన్‌ను దక్కించుకుంది. తద్వారా అతడు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ళ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.

  • యువరాజ్:

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ను ఐపీఎల్ 2015 వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ రూ. 16 కోట్లకు దక్కించుకుంది. తద్వారా యువరాజ్ సింగ్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల లిస్టులో ఐదో స్థానాన్ని పూరన్‌తో పంచుకున్నాడు.

సీజన్ల వారీ అత్యధిక ధర పలికిన ప్లేయర్స్:

ఐపీఎల్ సీజన్ ప్లేయర్ పేరు అత్యధిక ధర
2008 ఎం.ఎస్.ధోని(చెన్నై) రూ. 9.5 కోట్లు
2009 కెవిన్ పీటర్సన్(బెంగళూరు) రూ. 9.8 కోట్లు
2009 అండ్రూ ఫ్లింటాఫ్(చెన్నై) రూ. 9.8 కోట్లు
2010 షేన్ బాండ్(కేకేఆర్) రూ. 4.8 కోట్లు
2010 కీరన్ పోలార్డ్(ముంబై) రూ. 4.8 కోట్లు
2011 గౌతమ్ గంభీర్(కేకేఆర్) రూ. 14.9 కోట్లు
2012 రవీంద్ర జడేజా(చెన్నై) రూ. 12.8 కోట్లు
2013 మ్యాక్స్‌వెల్(ముంబై) రూ. 6.3 కోట్లు
2014 యువరాజ్ సింగ్(బెంగళూరు) రూ. 14 కోట్లు
2015 యువరాజ్ సింగ్(ఢిల్లీ) రూ. 16 కోట్లు
2016 షేన్ వాట్సన్(బెంగళూరు) రూ. 9.5 కోట్లు
2017 బెన్ స్టోక్స్(పూణే) రూ. 14.5 కోట్లు
2018 బెన్ స్టోక్స్(రాయల్స్) రూ. 12.5 కోట్లు
2019 జయదేవ్ ఉనద్కత్(రాయల్స్) రూ. 8.4 కోట్లు
2019 వరుణ్ చక్రవర్తి(పంజాబ్) రూ. 8.4 కోట్లు
2020 ప్యాట్ కమ్మిన్స్(కేకేఆర్) రూ. 15.5 కోట్లు
2021 క్రిస్ మోరిస్(రాయల్స్) రూ. 16.25 కోట్లు
2022 ఇషాన్ కిషన్(ముంబై) రూ. 15.25 కోట్లు
2023 సామ్ కర్రన్(పంజాబ్) రూ. 18.50 కోట్లు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?