Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. సిఫార్సు తీసుకోమని ప్రకటన

కోయిల్‌ అంటే గుడి.. ఆళ్వార్‌ అంటే భక్తుడు .. ఆళ్వార్ అంటే.. శ్రీ వైష్ణవ పరంపరలో ఆళ్వార్‌లు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన భక్తులు.. తిరుమంజనం అంటే అభిషేకం. జనవరి 2వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 27న ఆలయ శుద్ధి చేయనున్నారు.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. సిఫార్సు తీసుకోమని ప్రకటన
Tirumala Tirupati
Follow us

|

Updated on: Dec 24, 2022 | 1:19 PM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం.. భూలోక వైకుంఠం.. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతోంది.  శ్రీనివాసుడికి నిత్యం రకరకాల ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. వీటిల్లో ఒకటి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఈ ఉత్సవాన్ని ఏడాదిలో నాలుగు సార్లు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27న ఉదయం 6 నుండి 12 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీంతో  డిసెంబరు 27న బ్రేక్ ద‌ర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అంతేకాదు ఈ ఉత్సవం కారణంగా డిసెంబరు 26న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని పేర్కొంది. తిరుమలకు వచ్చే భ‌క్తులు ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని.. టీటీడీకి స‌హ‌క‌రించాల‌ని అధికారులు కోరుతున్నారు.

మాహావిష్ణువు భూలోకంలో స్వయంగా వెలసిన క్షేత్రం తిరుమల అత్యంత పవిత్రమైంది. కనుక ఏటా.. ఉగాది, అణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగు సార్లు శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉత్సవంగా నిర్వహిస్తారు. దీనినే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని అంటారు. కోయిల్‌ అంటే గుడి.. ఆళ్వార్‌ అంటే భక్తుడు .. ఆళ్వార్ అంటే.. శ్రీ వైష్ణవ పరంపరలో ఆళ్వార్‌లు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన భక్తులు.. తిరుమంజనం అంటే అభిషేకం. జనవరి 2వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 27న ఆలయ శుద్ధి చేయనున్నారు. కర్పూరం, చందనం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ.. తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపి శ్రీవారి ఆలయాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో శుద్ధి చేస్తారు. అందుకే ఈ సేవకు అత్యంత ప్రాధాన్యం ఉంది.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 6 కంపార్ట్స్ మెంట్స్ లో ఎదురు చూస్తున్నారు.  సర్వదర్శనానికి సుమారు 24గంటలు పడుతోంది. మరోవైపు శుక్రవారం రోజున 62,055 మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.  భక్తులు హుండిలో వేసిన కానుకలు రూ. 3. 99 లు కాగా 23,044 మంది భక్తులు తమ తలనీలాలను స్వామివారికి సమర్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..