Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే.. ఈ వాస్తు నియమాలను అనుసరించండి

మెరుగైన రోజువారీ జీవనంతో పాటు.. మీ ఇంటి సరైన వాస్తు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నమ్మకం. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా.. ఉండాలని మీరు కోరుకుంటే.. ఖచ్చితంగా ఈ వాస్తు నియమాలను అనుసరించండి.

Vastu Tips: మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే.. ఈ వాస్తు నియమాలను అనుసరించండి
Vastu Tips For Good Health
Follow us
Surya Kala

|

Updated on: Dec 23, 2022 | 1:46 PM

ప్రతి వ్యక్తి తన ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని.. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. జీవితంలో ఏడు రకాల ఆనందాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. అందులో మొదటి స్థానం ఆరోగ్యకరమైన శరీరం. అయితే మారుతున్న కాలంలో పాటు మారిన జీవన విధానంతో మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నేటి కాలంలో దాదాపు ప్రతి వ్యక్తి పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులను పడుతున్నాడు. అటువంటి పరిస్థితిలో.. సంపూర్ణ ఆరోగ్యకరమైన జీవితం ఓ సవాల్ గా మారింది. మెరుగైన రోజువారీ జీవనంతో పాటు.. మీ ఇంటి సరైన వాస్తు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నమ్మకం. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా.. ఉండాలని మీరు కోరుకుంటే.. ఖచ్చితంగా ఈ వాస్తు నియమాలను అనుసరించండి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

  1. వాస్తు ప్రకారం.. మీరు తప్పు దిశలో పడుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఉత్తర దిశలో తల పెట్టి నిద్రించే వారిని ప్రతికూల శక్తి త్వరగా ఆకర్షిస్తుందని నమ్మకం. ఇలా నిద్రపోవడం వలన తరచుగా వ్యాధితో బాధపడుతునే ఉంటారు. ఇది కాకుండా, మీ బెడ్ కు గది గోడకు  మధ్య కనీసం మూడు అంగుళాల దూరం ఉండాలని కూడా గుర్తుంచుకోండి.
  2. మీ ఇంటి రంగు కూడా మంచి ఆరోగ్యానికి కారణమని విశ్వాసం. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే.. అప్పుడు గోడకు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగును వేయడానికి ప్రయత్నించండి. ఎరుపు రంగు సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు. మరోవైపు, ఆకుపచ్చ రంగు శాంతిని ఇస్తుంది.
  3. వాస్తు ప్రకారం, మీ బాత్రూమ్ కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీ స్నాన చేసే ప్రాంతం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలని గుర్తుంచుకోండి. అక్కడ నుంచి ఎలాంటి వాసన రాకూడదు. అంతేకాదు.. మీ బాత్రూమ్‌లోని ఏదైనా కుళాయి నుండి నీరు కారుతుంటే, వెంటనే దాన్ని పరిష్కరించండి. ఇది ప్రతికూల శక్తిని త్వరగా ఆకర్షిస్తుంది అని నమ్ముతారు.
  4. వాస్తు ప్రకారం, మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే, ఇంటికి తూర్పు , ఈశాన్య దిశల వైపు సరిహద్దు గోడను ఎల్లప్పుడూ తక్కువ ఎత్తులో నిర్మించండి.. తద్వారా మీకు ఆరోగ్యాన్ని  ఇచ్చే సూర్య కిరణాలు ప్రసరిస్తాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఇంట్లోని పూజా స్థలం అత్యంత ప్రశాంతమైన, పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. పూజగదిలో  పగిలిన విగ్రహాన్ని ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఉదయం పూజ చేసేటప్పుడు ధూపదీపాలను వెలిగించండి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని.. ఒత్తిడి కూడా తగ్గిస్తుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)