AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త..శనివారం అందుబాటులోకి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు.. ఎలా పొందాలంటే?

జనవరి 2వ తేదీ నుంచి 11 వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్‌ టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇవి భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి.

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త..శనివారం అందుబాటులోకి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు.. ఎలా పొందాలంటే?
Ttd
Basha Shek
|

Updated on: Dec 23, 2022 | 8:40 PM

Share

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. వైకుంఠ ద్వారం ద్వారా ఏడుకొండల వాడిని దర్శించుకునేవారి కోసం శనివారం (డిసెంబర్‌24) సుమారు 2 లక్షల టికెట్లను విడుదల చేయనుంది. జనవరి 2వ తేదీ నుంచి 11 వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్‌ టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇవి భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. రోజుకు 20వేలు చొప్పున 10 రోజులకు సంబంధించిన మొత్తం 2లక్షల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. కాగా భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300/- దర్శన టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం ఉంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. నకిలీ వెబ్‌సైట్లను చూసి మోసపోవద్దని హెచ్చరించింది.

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకోని టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో కంటే ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే రోజుకు 20 వేల చొప్పున 10 రోజులకు రూ. 2 లక్షల టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు చేసింది. అలాగే అర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు 2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి ఉత్సవాలు జరగనున్నాయి. కాగా టికెట్లు పొందిన వారిని మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకిరించాలని టీటీడీ అధికారుల కోరారు

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మార్కెట్‌లోకి స్టడ్స్ రైడర్ యూత్ హెల్మెట్.. ప్రత్యేకతలు ఇవే
మార్కెట్‌లోకి స్టడ్స్ రైడర్ యూత్ హెల్మెట్.. ప్రత్యేకతలు ఇవే
ఖర్జూరం vs బాదం.. ఆరోగ్యానికి ఏది మంచిది?
ఖర్జూరం vs బాదం.. ఆరోగ్యానికి ఏది మంచిది?
శరవేగంగా దూసుకుపోతున్న విడా ఈవీ బ్రాండ్.. ప్రత్యేకతలివే
శరవేగంగా దూసుకుపోతున్న విడా ఈవీ బ్రాండ్.. ప్రత్యేకతలివే
ఉదయాన్నే సద్గురు తాగే సుక్కు మల్లి కాఫీ ప్రత్యేకత ఏంటి?లాభాలు ఇవే
ఉదయాన్నే సద్గురు తాగే సుక్కు మల్లి కాఫీ ప్రత్యేకత ఏంటి?లాభాలు ఇవే
మార్కెట్‌లో టీవీఎస్ హవా.. వెనుకబడిన ఓలా ఎలక్ట్రిక్
మార్కెట్‌లో టీవీఎస్ హవా.. వెనుకబడిన ఓలా ఎలక్ట్రిక్
మహీంద్రా నుంచి స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్.. ప్రత్యేకతలివే
మహీంద్రా నుంచి స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్.. ప్రత్యేకతలివే
ఒక్కరోజులోనే ఊహించని మార్పులు.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
ఒక్కరోజులోనే ఊహించని మార్పులు.. భారీగా పెరిగిన బంగారం ధరలు..
ఓటీటీలోకి వచ్చేసిన అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా 'లెనిన్'..
ఓటీటీలోకి వచ్చేసిన అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా 'లెనిన్'..
అదిరిపోయే ఆడియో ఫీచర్లతో ఎమ్‌జెడ్ ఎం423ఎస్‌పి
అదిరిపోయే ఆడియో ఫీచర్లతో ఎమ్‌జెడ్ ఎం423ఎస్‌పి
శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని..
శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీకటాక్షం.. ధనం, ఐశ్వర్యం పెరుగుతాయని..