AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. మరికొద్ది సేపట్లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు.. ఇలా బుక్‌ చేసుకోండి

జనవరి 2 నుంచి 11 వ తేదీకి సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు భక్తులకు అందుబాటులో రానున్నాయి. రోజుకు 20వేలు చొప్పున 10 రోజులకు సుమారు 2 టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్‌.. మరికొద్ది సేపట్లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు.. ఇలా బుక్‌ చేసుకోండి
Tirumala Srivari Temple
Basha Shek
|

Updated on: Dec 24, 2022 | 7:43 AM

Share

శ్రీవారి భక్తులకు అలెర్ట్‌. ఇవాళ (డిసెంబర్‌24) ఉదయం 9 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేయనుంది. జనవరి 2 నుంచి 11 వ తేదీకి సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయనుంది. జనవరి 2 నుంచి 11 వ తేదీకి సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు భక్తులకు అందుబాటులో రానున్నాయి. రోజుకు 20వేలు చొప్పున 10 రోజులకు సుమారు 2 టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. కాగా భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300/- దర్శన టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం ఉంటుంది. కాగా నకిలీ వెబ్‌సైట్లను చూసి మోసపోవద్దని టీటీడీ హెచ్చరించింది. కాగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకోని టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 2 నుంచి 11 తేదీల్లో ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా జనవరి 2న రాజ్యాంగ హోదాలో వీఐపీలు స్వయంగా వస్తే మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని టీటీడీ తెలిపింది. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు చేసింది. అలాగే అర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు 2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి ఉత్సవాలు జరగనున్నాయి. కాగా టికెట్లు పొందిన వారిని మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకిరించాలని టీటీడీ అధికారుల కోరారు. మరోవైపు 2023 నకు సంబంధించి టీటీడీ ముద్రించిన 6 షీట్ల క్యాలండర్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విడుదల చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ క్యాలండర్లు తిరుమల,తిరుపతిలో భక్తులకు అందుబాటులో వచ్చాయి. అలాగే చెన్నై,బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ తదితర నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో రెండు రోజుల పాటు భక్తులకు అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆశలు నెరవేరే సమయం.. అక్టోబర్‌లోపు వారి జీవితంలో ఊహించని మార్పులు
ఆశలు నెరవేరే సమయం.. అక్టోబర్‌లోపు వారి జీవితంలో ఊహించని మార్పులు
ఫిఫా ఫుట్‌బాల్స్ ఏ దేశంలో తయారు చేస్తారో తెలుసా?
ఫిఫా ఫుట్‌బాల్స్ ఏ దేశంలో తయారు చేస్తారో తెలుసా?
రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధుల రాజీనామా!
రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధుల రాజీనామా!
పాకిస్థాన్‌లో బంగారం ధరల మోత..! భారత్‌తో పోలిస్తే ఎంత తేడా ఉందంటే
పాకిస్థాన్‌లో బంగారం ధరల మోత..! భారత్‌తో పోలిస్తే ఎంత తేడా ఉందంటే
నెల రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు!
నెల రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు!
ఇంట్లోనే న్యాచురల్‌గా తెల్లు జుట్టును నల్లగా మార్చుకోండి!
ఇంట్లోనే న్యాచురల్‌గా తెల్లు జుట్టును నల్లగా మార్చుకోండి!
సమసప్తక యోగం ప్రభావం.. ఈ 3 రాశుల వారికి కెరీర్‌లో బిగ్ బ్రేక్..
సమసప్తక యోగం ప్రభావం.. ఈ 3 రాశుల వారికి కెరీర్‌లో బిగ్ బ్రేక్..
మతం మార్పిడి రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు!
మతం మార్పిడి రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు!
నాన్నని నాన్నే మిస్ అవుతుంటాడు.. తండ్రి గురించి పూరి మాటల్లో..
నాన్నని నాన్నే మిస్ అవుతుంటాడు.. తండ్రి గురించి పూరి మాటల్లో..
ఈ వారం ఓటీటీలో ఈ 3 సినిమాలు తప్పక చూడాల్సిందే..
ఈ వారం ఓటీటీలో ఈ 3 సినిమాలు తప్పక చూడాల్సిందే..