Rahu Transit 2023 : కొత్త ఏడాది 2023లో రాహువు ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు.. ఆర్ధిక ఇబ్బందులు సహా అనేక కష్టాలు ఏర్పడతాయి..

2023లో రాహువు అక్టోబరు 30న కుజుడు రాశి అయిన మేషరాశిలో అడుగు పెట్టనున్నాడు. ప్రస్తుతం రాహువు బృహస్పతి అధినేత అయిన మీన రాశిలో సంచరిస్తున్నాడు. కొత్త సంవత్సరంలో రాహువు సంచారం ఐదు రాశుల వారిపై ప్రభావం చూపనుంది.

Rahu Transit 2023 : కొత్త ఏడాది 2023లో రాహువు ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు.. ఆర్ధిక ఇబ్బందులు సహా అనేక కష్టాలు ఏర్పడతాయి..
Rahu Gochar 2023
Follow us
Surya Kala

|

Updated on: Dec 24, 2022 | 8:35 AM

2023 సంవత్సరంలో రాహువు, కేతువు,  శని వంటి ప్రధాన గ్రహాలతో సహా అనేక గ్రహాలు తమ స్థానాలను మార్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో అనేక రాశి చక్రాల్లో మార్పులు రానున్నాయి. శని తర్వాత రాహువు నెమ్మదిగా కదులుతాడు. రాహువు సుమారు 18 నెలలు ప్రయాణించి తన రాశిని మార్చుకుంటాడు. అంతేకాదు రాహువు ఎప్పుడూ తిరోగమన గ్రహం. రాహువు శనిగ్రహాల సంచారం మానవుల జీవితంపై ప్రభావాన్ని చూపిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..  రాహువు చెడు ప్రభావం ఎవరికైనా ఉంటే..  అతని జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి.

2023లో రాహువు అక్టోబరు 30న కుజుడు రాశి అయిన మేషరాశిలో అడుగు పెట్టనున్నాడు. ప్రస్తుతం రాహువు బృహస్పతి అధినేత అయిన మీన రాశిలో సంచరిస్తున్నాడు. కొత్త సంవత్సరంలో రాహువు సంచారం ఐదు రాశుల వారిపై ప్రభావం చూపనుంది. ఈ ఐదు రాశుల వారు రాహువు ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మేషరాశి 2023 సంవత్సరం ప్రారంభంలో..  రాహువు ఈ రాశి వారి మొదటి ఇంటిలో సంచరిస్తాడు. తరువాత అక్టోబర్ 30 న.. రాహువు ఈ రాశి చక్రంలోని పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. 2023వ సంవత్సరంలో ఈ రాహు సంచారం వల్ల మేష రాశి వారి మనస్సుల్లో గందరగోళం ఏర్పడుతుంది. రాహువు ప్రభావం వల్ల తొందరపాటు తప్పుడు నిర్ణయం తీసుకోవడం ఈ వ్యక్తుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మేష రాశి వారిపై ఆర్థిక సమస్యల భారం అధికంగా  ఉంటుంది. ధన నష్టాన్ని ఎదుర్కోవచ్చు. అంతే కాకుండా 2023లో కుజుడు రాశి మారడం వల్ల రాహువుతో గురు-చండాల దోషం వంటి అశుభ యోగం ఏర్పడుతుంది. దీంతో కొత్త ఏడాదిలో మేష రాశి వారికి కష్టాలు పెరగవచ్చు.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి  2023 సంవత్సరంలో రాహువు సంచారం వలన ఈ రాశి వారికి సమస్యలు ఏర్పడతాయి. సంవత్సరం ప్రారంభంలో.. రాహువు  ఈ రాశి చక్రంలో పన్నెండవ ఇంట్లో సంచరిస్తాడు. అటువంటి పరిస్థితిలో.. ఈ రాశివారు అధికంగా ఖర్చులు చేస్తారు. ఆర్ధికంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేకాదు  మానసిక, ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. ఏప్రిల్ 22 న.. గురు-చండాల యోగం కారణంగా.. ఈ రాశివారి ఆరోగ్యం క్షీణించవచ్చు.

తుల రాశి ఈ రాశిలో రాహువు సంచరించడం వలన వ్యాపారం చేసే వారికి కష్టాలు కలుగుతాయి. కొన్ని నిర్ణయాలు వ్యాపారంలో నష్టాన్ని కలిగిస్తాయి. ఏదైనా ఆస్తి విషయంలో కుటుంబంలో వాదోపవాదాలు ఏర్పాడవచ్చు.

మకరరాశి మకర రాశి వారికి 2023 సంవత్సరం రాహువు వలన ఇబ్బందులు కలుగుతాయి. వైవాహిక, ప్రేమ జీవితంలో గొడవలు, ఉద్రిక్తతలు ఏర్పడతాయి.  ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు అనవసరమైన ఖర్చులను చేస్తారు. మనస్సు భారంగా ఉంటుంది. దీని కారణంగా ఈ రాశివారు తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడుతూ ఉంటారు

మీనరాశి మీన రాశి వారిపై 2023 సంవత్సరంలో రాహువు మిశ్రమ ప్రభావం చూపుతుంది. సంవత్సరం ప్రారంభంలో రాహువు రెండవ ఇంటిలో ఉంటాడు. అక్టోబర్ 30 న రాహువు రెండవ ఇంటిని విడిచిపెట్టి మొదటి ఇంటిలో సంచరిస్తాడు. 2023 సంవత్సరంలో.. కుటుంబ ఆస్తికి సంబంధించి వివాదం ఏర్పడుతుంది. దీని  కారణంగా వీరు కోర్టుకు వెళ్లవలసి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!