Horoscope: ఈ రాశివారు అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కొందరు బంధువులతో చిన్నపాటి విభేదాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Horoscope: ఈ రాశివారు అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది.. శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Dec 24, 2022 | 6:32 AM

  • మేషం(అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రోజు కొందరు సన్నిహితులతో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతి బంధకాలు తొలగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రయోజనం చేకూరుస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. అనుకోకుండా కొందరు బంధువులకు ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుంది.

  • వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్య లేకుండా ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. ధనపరంగా ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలను వాయిదా వేయటం మంచిది. ఉద్యోగాల విషయంలో శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది.

  • మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఇంట్లోనూ, ఉద్యోగంలోను పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

  • కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు శుభ ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిగా మెరుగుదల కనిపిస్తుంది. ఇంటికి కావలసిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరుల సమస్యల్లో తల దూర్చకపోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది.

  • సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కొందరు బంధువులతో చిన్నపాటి విభేదాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కొందరు స్నేహితులకు సహాయం చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని పెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

  • కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అనుకోకుండా కొన్ని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. దగ్గర బంధువుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు పని ఒత్తిడితో అవస్థలు పడతారు. ఇరుగుపొరుగు వ్యవహారాల్లో తల దూర్చటం మంచిది కాదు. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది.

  • తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి చాలా వరకు లాభసాటిగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ముఖ్యమైన లక్ష్యాలు పూర్తి చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. కొత్త ఉద్యోగానికి మంచి కంపెనీ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ సభ్యులు మంచి సహకారం అందిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు.

  • వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆటంకాలు ఉన్నా అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలలో ఇబ్బంది పడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కొందరు బంధువులు ఇబ్బందులు పెడతారు. పిల్లలు చదువులో పురోగతి చెందుతారు. వ్యాపార ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి

  • ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక వ్యవహారాలు చాలావరకు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి నిపుణులకు మంచి కంపెనీ నుంచి ఆఫర్ అందుతుంది. విద్యార్థులు చదువుల్లో ముందుకు వెళతారు. ఆరోగ్యం పర్వాలేదు. పిల్లల కారణంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మంచి శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది.

  • మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడతాయి. స్నేహితులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువులలో పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

  • కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు కనిపిస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో తిప్పట ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెడతారు. పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

  • మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కానీ ఉద్యోగంలో పని భారం ఎక్కువై ఇబ్బంది పడతారు. అనుకోకుండా మొండి బకాయి ఒకటి వసూలు అవుతుంది. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఐటీ నిపుణులు శుభవార్త వింటారు. కొందరు బంధువులతో విరోధం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే