Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Shashtra: ఇంట్లోని ఈ ప్రదేశాల్లో సాలీడు గూళ్లను అస్సలు ఉండనివ్వొద్దు.. ఆర్థికంగా చితికిపోతారు..!

భారతదేశంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇంటి నిర్మాణంలో ప్రతీ అంశాన్ని వాస్తు ప్రకారం నిర్ణయించి నిర్మిస్తారు. వాస్తు దోషాల కారణంగా జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని..

Vastu Shashtra: ఇంట్లోని ఈ ప్రదేశాల్లో సాలీడు గూళ్లను అస్సలు ఉండనివ్వొద్దు.. ఆర్థికంగా చితికిపోతారు..!
Vastu Tips
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 24, 2022 | 5:48 AM

భారతదేశంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇంటి నిర్మాణంలో ప్రతీ అంశాన్ని వాస్తు ప్రకారం నిర్ణయించి నిర్మిస్తారు. వాస్తు దోషాల కారణంగా జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతుంటారు. అందుకే.. ఇంట్లో ప్రతీది వాస్తు ప్రకారమే సెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లో సామాగ్రి మొదలు.. ప్రతీది వాస్తు ప్రకారం చూసుకుని ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. అయితే, ఇంట్లో మూలల్లో, నిరుపయోగంగా ఉన్న ప్రాంతాల్లో, గోడలపై సాలీడు పురుగులు గూళ్లను పెడుతుంటాయి. అయితే, అలా సాలీడు గూళ్లు ఎక్కడబడితే అక్కడ ఉండటం అంత మంచిది కాదని, వాటి కారణంగా ఇంట్లో చెడు జరుగుతుందంటున్నారు నిపుణులు. మరి సాలీడు పురుగుల గూళ్లు ఇంట్లో ఎక్కడ ఉండొద్దు? ఉంటే ఏం జరుగుతుంది? వంటి వివరాలు తెలుసుకుందాం..

1. ఇంట్లో సాలీడు గూళ్లు ఉంటే వాస్తు ప్రకారం పేదరికానికి సూచికగా భావిస్తారు. కొన్నిసార్లు సాలీడు గూళ్లు ఇంట్లో ఉన్నప్పటికీ.. వాటిని విస్మరిస్తుంటారు. అయితే, అలా ఉండటం వల్ల ఇంట్లోకి నెగెటీవ్ ఎనర్జీ ప్రవహించి.. ఆర్థికంగా కునారిళ్లిపోవడం ఖాయం అంటున్నారు వాస్తు పండితులు.

2. పడకగదిలో, కిటికీలు, తలుపులు, గోడలపై ఎక్కడైనా సాలెపురుగుల గూళ్లు ఉండకూడదు. అలా ఉంటే.. వైవాహిక జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. దంపతుల మధ్య నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటాయి. భార్యభర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి.

3. బాత్రూమ్ రాహువు ప్రధాన ప్రదేశం. బాత్రూమ్ లేదా టాయిలెట్లో సాలెపురుగులు ఉండకూడదు. దీని కారణంగా వ్యాధులు, ఇతర అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లో అశాంతి నెలకొంటుంది.

4. ఇంటి పైకప్పులో ఏదైనా మూలలో సాలెపురుగులు ఉంటే వాటిని వెంటనే తొలగించాలి. ఈ గూళ్లు కొన్నిసార్లు చిన్నవిగా ఉంటాయి. దాంతో వాటిని చాలామంది విస్మరిస్తారు. అయితే, వీటి కారణంగా ఇంటి యజమాని ఆర్థికంగా నష్టపోతారు. డబ్బు ఎంత సంపాదించినా.. నీరులాగే వృధాగా ఖర్చు అవుతుంది.

5. వంట గదిలో సాలీడు ఉండటం వల్ల ఇంటి సభ్యులు అనారోగ్యానికి గురవుతుంటారు. కుటుంబం పురోగతి ఆగిపోతుంది. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ కింద సాలీడు గూళ్లు ఉంటే వెంటనే తీసివేయాలి.

6. ఇంట్లో పూజించే స్థలం అత్యంత పవిత్రమైనది. ఇంట్లోకి సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది. ఇలాంటి కీలక ప్రదేశంలో సాలెపురుగులు ఉంటే.. వారి అదృష్టం కాస్తా దురదృష్టంగా మారుతుంది. అనవసరమైన గొడవలు, ఆర్థిక నష్టాలు, బాధలు మొదలవుతాయి. పూజ చేసినా ఫలితం ఉండదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..