AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC: అభ్యర్థులకు అలర్ట్.. అభ్యంతరాల దరఖాస్తుకు డబ్బులు చెల్లించాల్సిందే.. ఏపీపీఎస్సీ కీలక ప్రకటన..

అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచన చేసింది. వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలు, వాటి జవాబులపై అభ్యర్థులు లేవనెత్తే అభ్యంతరాలకు రుసుము చెల్లించాలని వెల్లడించింది. ఒక్కో దానికి...

APPSC: అభ్యర్థులకు అలర్ట్.. అభ్యంతరాల దరఖాస్తుకు డబ్బులు చెల్లించాల్సిందే.. ఏపీపీఎస్సీ కీలక ప్రకటన..
Appsc Group 1
Ganesh Mudavath
|

Updated on: Dec 24, 2022 | 2:32 PM

Share

అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచన చేసింది. వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలు, వాటి జవాబులపై అభ్యర్థులు లేవనెత్తే అభ్యంతరాలకు రుసుము చెల్లించాలని వెల్లడించింది. ఒక్కో దానికి రూ.100 కట్టాలని కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లన్నింటికీ ఈ రూల్ అప్లికబుల్ అవుతుందని స్పష్టం చేసింది. కమిషన్‌ నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌ పరీక్ష (స్క్రీనింగ్‌ టెస్టు)ల్లో ఆబ్జెక్టివ్‌ టైప్‌ పేపర్‌లోని ప్రశ్నలు, వాటి సమాధానాల కీలకు వ్యతిరేకంగా అభ్యర్థులు తప్పుడు, అసంబద్ధమైన అభ్యంతరాలను దాఖలు చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాటి సంఖ్య వేలల్లోనే ఉంది. అయితే వీటిని పరిశీలించి అన్నింటికీ సరైన సమాధానం ఇచ్చేందుకు సమయం పడుతోంది. ఇలా చేయడం వల్ల అభ్యర్థులకు వివరాలు వెల్లడించడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు, తప్పుడు అభ్యంతరాలకు చెక్ పెట్టేందుకు ఒక్కో అభ్యంతర అప్లికేషన్ కు రూ.100 కట్టాలనే కొత్త నిబంధన తీసుకొచ్చినట్లు ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు.

కమిషన్‌ నిర్వహించే అన్ని పరీక్షలకు వర్తించేలా ఒక నిబంధన చేర్చాలని కమిషన్‌ నిర్ణయించింది. దీని ప్రకారం ప్రశ్న పత్రం, జవాబు కీ, ఇతర విషయాలకు సంబంధించిన వివాదాల పరిష్కారం కింద ఈ నిబంధన పెట్టాలని కమిషన్‌ నిర్ణయించింది. అభ్యర్థులు దాఖలు చేసిన అభ్యంతరాల తుది పరిశీలనలో నిజమైన వాటిని దాఖలు చేసిన అభ్యర్ధులకు ఆ మొత్తాన్ని తిరిగి కమిషన్‌ చెల్లిస్తుందని కమిషన్‌ కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..