Hyderabad: రూ.13 లక్షలకే సింగిల్ బెడ్‌రూమ్.. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు సువర్ణావకాశం
హైదరాబాద్ నగరంలో సొంతింటి కల నెరవేర్చుకునేవారికి మంచి అవకాశం ఉంది. తక్కువ ధరల్లోనే ప్లాట్లను దక్కించుకునే అవకాశం ఉంది. ఇల్లు కొనుగోలు చేసేవారికి..
హైదరాబాద్ నగరంలో సొంతింటి కల నెరవేర్చుకునేవారికి మంచి అవకాశం ఉంది. తక్కువ ధరల్లోనే ప్లాట్లను దక్కించుకునే అవకాశం ఉంది. ఇల్లు కొనుగోలు చేసేవారికి హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మరో సువర్ణావకాశాన్ని ఇచ్చింది. నగరంలోని పోచారం, బండ్ల గూడ రాజీవ్ స్వగృహకు సంబంధించి అపార్ట్‌మెంట్‌లో మిగిలిపోయిన ప్లాట్లను తిరిగి లాటరీలో విక్రయించేందుకు సిద్ధమైంది. ఇందు కోసం ప్రకటన జారీ చేసింది. నిబంధనల ప్రకారం ప్లాట్‌ను దక్కించుకోవాలంటే జనవరి 18 తేదీలోపు టోకెన్ అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుందని హెచ్‌ఎండీఏ తెలిపింది. సింగిల్ బెడ్‌రూమ్‌కు 1 లక్ష రూపాయలు, డబుల్ బెడ్‌రూమ్‌కు రూ.2 లక్షలు, త్రిబుల్ బెడ్‌రూమ్, డీలక్స్ ప్లాట్లకు రూ.3 లక్షల చొప్పున టోకెన్ అడ్వాన్స్ కింద నిర్ణయించారు. ఈ రెండు చోట్ల మొత్తం 3200 ప్లాట్లు ముందుగా అందుబాటులో ఉండేవి. అయితే విడతల వారీగా నిర్వహించిన లాటరీల్లో చాలా మేరకు అమ్ముడుపోయాయి. బండ్లగూడలో ఇప్పటికే 3బీహెచ్‌కే ప్లాట్లు అమ్ముడయ్యాయి.
ప్రస్తుతం ఇక్కడ సింగిల్ బెడ్ రూమ్ సీనియర్ సిటిజన్ల ప్లాట్లు మిగిలి ఉన్నాయి. పోచారం కేవలం 16 త్రిబుల్ బెడ్‌రూమ్ ప్లాట్లు ఉన్నాయని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఇక్కడ కేవలం రూ.13 లక్షలతో ఇక్కడ సింగిల్‌బెడ్ రూమ్ ఫ్లాట్‌ను దక్కించుకోవచ్చు. చిరుద్యోగులు సైతం వీటిని దక్కించుకునేందుకు అవకాశం ఉంది. రెండు చోట్ల త్రిబుల్ బెడ్‌రూమ్ ప్లాట్లు హాట్ కేక్‌ల్లా అమ్మడుపోయాయి. పోచారం చుట్టు ఐటీ కంపెనీలు విస్తరిస్తున్న తరుణంలో ఇక్కడ డిమాండ్ మరింతగా ఉంది.
కాగా, పోచారం, బండ్లగూడలో త్రిబుల్ బెడ్‌రూమ్ డీలక్స్, త్రిబుల్ బెడ్‌రూమ్, డబుల్, సింగిల్ బెడ్ రూమ్‌లకు సంబంధించి దాదాపు 3,200 ప్లాట్లను గతంలో లారటీ విధానం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే వీటిని దక్కించుకున్న చాలా మంది డబ్బులు కట్టేందుకు ఇప్పటి వరకు ముందు రాలేదు. అలా రెండు చోట్ల దాదాపు 2 వేలకుపైగా ప్లాట్లు మిగిలిపోయాయి. తర్వాత టోకెన్ అడ్వాన్స్ రూల్స్ విధించడంతో అవసరమైన వారు ముందుకొచ్చి ప్లాట్లను దక్కించుకున్నారు. ఇప్పుడు బండ్లగూడలో డబుల్ బెడ్‌రూమ్‌ల ప్లాట్లకు మంచి డిమాండ్ వచ్చింది. ఇక్కడ డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, వీటిని వీటిని పూర్తి స్థాయిలో విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే బండ్లగూడలో సింగిల్ బెడ్‌రూమ్ ప్లాట్ ధర రూ.15 లక్షలు, పోచారంలో రూ.13 లక్షలకే సొంతం చేసుకోవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి