Financial Rules Changing: కస్టమర్లకు అలర్ట్.. జనవరి 1 నుంచి మారనున్న నిబంధనలు
2022 సంవత్సరం త్వరలో ముగియనుంది. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. అటువంటి పరిస్థితిలో కొత్త సంవత్సరంతో పాటు మీ బ్యాంక్, ఫైనాన్స్‌కు సంబంధించిన..

Financial Rules
2022 సంవత్సరం త్వరలో ముగియనుంది. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. అటువంటి పరిస్థితిలో కొత్త సంవత్సరంతో పాటు మీ బ్యాంక్, ఫైనాన్స్‌కు సంబంధించిన అనేక నియమాలు మారబోతున్నాయి ఈ మార్పులు నేరుగా మీ ఆర్థిక విషయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. జనవరి 1, 2023 నుండి మారబోయే ఆర్థిక నియమాలు క్రెడిట్ కార్డ్, బ్యాంక్ లాకర్, జీఎస్టీ ఇ-ఇన్‌వాయిసింగ్, సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్ ధరలు, వాహన ధరల పెరుగుదల వంటివి ఉన్నాయి.
- బ్యాంక్ లాకర్ కొత్త నియమాలు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన కొత్త లాకర్ నియమాలు జనవరి 1, 2023 నుండి అమలులోకి రానున్నాయి. ఈ నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత లాకర్ విషయంలో బ్యాంకులు ఖాతాదారులతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కుదరదు. లాకర్‌లో ఉంచిన వస్తువులకు నష్టం జరిగితే అప్పుడు బ్యాంకు బాధ్యత ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు వినియోగదారులు డిసెంబర్ 31 వరకు బ్యాంకుతో ఒప్పందంపై సంతకం చేయాలి. దీని ద్వారా లాకర్ నిబంధనలలో మార్పు గురించి ఖాతాదారులు ఎస్‌ఎంఎస్, ఇతర మార్గాల ద్వారా బ్యాంకుకు తెలియజేయాలి.
- క్రెడిట్ కార్డ్ నియమాలలో మార్పు: మీరు కూడా క్రెడిట్ కార్డ్ హోల్డర్ అయితే క్రెడిట్ కార్డ్ నిబంధనలలో పెద్ద మార్పు రాబోతోందని తెలుసుకోండి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై అందుకున్న రివార్డ్ పాయింట్ల నియమాలను మార్చబోతోంది. ఈ సందర్భంలో డిసెంబర్ 31, 2022లోపు మీ అన్ని రివార్డ్ పాయింట్‌లను రీడిమ్ చేసుకోండి.
- జీఎస్టీ ఇ-ఇన్‌వాయిసింగ్ నియమాలలో మార్పులు: కొత్త సంవత్సరం నుంచి జీఎస్టీ ఈ-ఇన్‌వాయిసింగ్ లేదా ఎలక్ట్రానిక్ బిల్లు నిబంధనలలో పెద్ద మార్పు రానుంది. 2023 సంవత్సరం నుండి జీఎస్టీ ఇ-ఇన్‌వాయిస్ కోసం ప్రభుత్వం ఇప్పుడు 20 కోట్ల పరిమితిని 5 కోట్లకు తగ్గించింది. అటువంటి పరిస్థితిలో ఈ కొత్త నిబంధన జనవరి 1, 2023 నుండి అమలు చేయబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో 5 కోట్లకు పైగా వ్యాపారం చేసే వ్యాపారులు ఎలక్ట్రానిక్ బిల్లులను రూపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి

PAN Card: కొన్ని లావాదేవీలకు పాన్ అవసరం లేదు.. బడ్జెట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

Post Office Franchise: పోస్టాఫీసు నుంచి డబ్బు సంపాదించేందుకు సువర్ణావకాశం.. పెట్టుబడి తక్కువ.. లాభం ఎక్కువ

2022 New Cars: ఈ ఏడాదిలో అందరి హృదయాలను గెలిచిన ఐదు కార్లు.. మైలేజీ, ధర వివరాలు

Income Tax Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. డిసెంబర్ 31 చివరి తేదీ.. లేకపోతే ఇబ్బందులే..!