Blood Donation: రేపు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్.. హాజరుకానున్న జేడీ లక్ష్మీనారాయణ, సినీ ప్రముఖులు.. ప్రత్యేక ఏర్పట్లు చేస్తోన్న నిర్వాహకులు

మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాన్ని చిరంజీవి చెల్లెలు మాధవి ఉదయం 10.00 గంటలకు అందరినీ ఆహ్వానించి రక్త సేకరణ కార్యక్రమం ప్రారంభించనున్నారు.  హైదరాబాద్ ఎల్ బి నగర్ మెట్రో స్టేషన్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు సాయింత్రం ఎల్ బి నగర్ వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది.

Blood Donation: రేపు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్.. హాజరుకానున్న జేడీ లక్ష్మీనారాయణ, సినీ ప్రముఖులు.. ప్రత్యేక ఏర్పట్లు చేస్తోన్న నిర్వాహకులు
Mega Blood Donation Camp
Follow us
Surya Kala

|

Updated on: Dec 24, 2022 | 12:02 PM

రియల్ హీరో, మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోనే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదిక కానుంది. రేపు (ఆదివారం) మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ అండ్ ఐ డొనేషన్ కేంద్రం వద్ద మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జేడీ లక్ష్మీనారాయణ సహా సినీ ప్రముఖులు, టీవీ కళాకారులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెగా అభిమానులు, జనసేన పార్టీ అన్ని విభాగాల శ్రేణులు,  ప్రముఖులు పాల్గొంటున్నారు. మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాన్ని చిరంజీవి చెల్లెలు మాధవి ఉదయం 10.00 గంటలకు అందరినీ ఆహ్వానించి రక్త సేకరణ కార్యక్రమం ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమంలో రక్త దానం చేసిన వారికి  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రం ఇస్తారు. అంతేకాదు ఎప్పుడైనా ఎవరికైనా రక్తం అవసరం అయితే.. వీరు సిఫార్స్ చేసిన వారికి  చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఇస్తారు. అంతేకాదు అదే మహిళలు రక్త దానం చేస్తే.. సిజేరియన్ డెలివరీ అయితే 35 ,000/-, సాధారణ కాన్పు అయితే 25 ,000/- హైదరాబాద్ , విశాఖపట్నం ఒమినీ ఆసుపత్రి శాఖల్లో .. చిరంజీవి రక్తనిధి నుంచి ఇచ్చిన ధృవపత్రం చూపించి ఫైనల్ బిల్లు లో డిస్కౌంట్ పొందవచ్చునని ఈ కార్యనిర్వాహకులు రవణం స్వామినాయుడు, యాళ్ల వర ప్రసాద్ లు  పేర్కొన్నారు.

రేపు రక్తదాతల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తోన్న నిర్వాహకులు:

ఇవి కూడా చదవండి

రేపు ఉదయం బ్లడ్ బ్యాంక్ దగ్గర అందరికీ అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. రక్త దానం చేసిన వారిని సాదరంగా ఆహ్వానించి పుష్ప గుచ్చం, పూలహారం, శాలువా తో సత్కరించి గౌరవిస్తారు. అంతేకాదు హైదరాబాద్ ఎల్ బి నగర్ మెట్రో స్టేషన్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు సాయింత్రం ఎల్ బి నగర్ వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. దేశంలో రక్తం కొరత చాలా వుందని దయచేసి రక్త దానం చేయండి, చేయించండి మరొకరి ప్రాణాన్ని కాపాడండి.. రక్త దాత సుఖీభవ.. అంటూ  నిర్వాహకులు కోరుతున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..