Christmas Day 2022: ప్రపంచవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు..మెదక్ కెథడ్రల్ అర్ధరాత్రి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు

వరల్డ్‌ వైడ్‌గా క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరుగుతున్నాయి. అమెరికా నుంచి మొదలు మన తెలుగు రాష్ట్రాల్లోనూ క్రిస్మస్‌ కోలాహలం అంబరాన్నంటుతోంది.

Christmas Day 2022: ప్రపంచవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు..మెదక్  కెథడ్రల్ అర్ధరాత్రి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
Christmas Day 2022
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 25, 2022 | 10:27 AM

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన జీసెస్ భక్తులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని చర్చిల్లో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. చర్చ్‌లను రంగు రంగుల విద్యుత్ దీపాలు, బెలూన్లు, స్టార్లతో అలంకరించారు. భారీ సైజు క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. అలాగే క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని భక్తుల కళ్లకు కట్టేలా పశువుల పాకను ఏర్పాటు చేశారు. తెల్లవారు జామున 4:30 గంటలకే ఫస్ట్​ సర్వీస్ తో క్రిస్మస్​ వేడుకలు ప్రారంభించారు.

వాటికన్‌ సిటీలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పోప్‌ ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఈ వేడుకలకు భారీగా జనం హాజరయ్యారు. ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కెథడ్రల్​ చర్చ్​ క్రిస్మస్‌ ప్రార్థనలు మొదలయ్యాయి.. చర్చ్​ఆప్​సౌత్​ఇండియా మెదక్ డయాసిస్​పరిధిలోని 13 జిల్లాలతోపాటు, పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.

ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కెథడ్రల్​ చర్చ్​ క్రిస్మస్​ సెలబ్రేషన్స్ జోరుగా సాగుతున్నాయి. చర్చ్​ ఆప్​ సౌత్​ ఇండియా మెదక్​ డయాసిస్​ పరిధిలోని 13 జిల్లాలతోపాటు, పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్ష మంది భక్తులు మెదక్​ చర్చిలో జరిగే క్రిస్మస్​ వేడుకలను తిలకించేందుకు తరలివస్తున్నారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు చర్చి నిర్వాహకులు. చర్చిని రంగు రంగుల విద్యుత్ దీపాలు, బెలూన్లు, స్టార్లతో అలంకరించారు. భారీ సైజు క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. అలాగే అలాగే క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని భక్తుల కళ్లకు కట్టేలా పశువుల పాకను ఏర్పాటు చేశారు. ఆదివారం తెల్లవారు జామున 4:30 గంటలకే ఫస్ట్​ సర్వీస్ తో క్రిస్మస్​ వేడుకలు మొదలయ్యాయి. ఈ వేడకలకు 500 మంది పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

గ్రేటర్ హైదరాబాద్‌‌లోనూ వేడుకలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌లో కూడా సందడిగా జరుగుతోంది. అన్ని చర్చిల్లో పత్యేక ప్రార్థనలను నిర్వహిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం