AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్‌ కేసులో నవీన్‌రెడ్డిని ప్రశ్నల వర్షం.. ఇవాళ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్న పోలీసులు

నవీన్ -వైశాలి ఎపిసోడ్ ఇంకా కొలిక్కి రాలేదు. ఇద్దరి వాదనలు, ఆరోపణలు భిన్నంగా ఉన్నాయి. మొత్తంగా ఎవరి వాదన ఎలా ఉన్నా పోలీసులు మాత్రం మరింత డీప్‌గా ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నారు.

Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్‌ కేసులో నవీన్‌రెడ్డిని ప్రశ్నల వర్షం.. ఇవాళ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయనున్న పోలీసులు
Accused Naveen Reddy
Sanjay Kasula
|

Updated on: Dec 25, 2022 | 10:55 AM

Share

తెలంగాణలో సంచలనంగా రేపిన వైశాలి కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సంచలనం రేపిన వైశాలి కిడ్నాప్‌ కేసులో నవీన్‌రెడ్డిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. రంగారెడ్డి కోర్టు అనుమతితో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు పోలీసులు. నవీన్‌రెడ్డిపై గతంలో ఉన్న కేసుల వివరాలు ఆరాతీస్తున్నారు. కిడ్నాప్ కేసులో A1 నిందితుడు నవీన్ రెడ్డిని విచారించేందుకు 8 రోజులు పోలీస్ కస్టడీకి కావాలంటూ ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇబ్రహీంపట్నం కోర్టు ఒకే రోజు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులు జిల్లా కోర్టును ఆశ్రయించగా 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. శనివారం చర్లపల్లి జైలు నుంచి నిందితుడు నవీన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని, ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌కి తరలించి విచారిస్తున్నారు.

ఇప్పటికే కీలక నిందితుడు నవీన్ రెడ్డితో పాటు ఇప్పటికే ఈ కేసులో 36 మందిని పోలీసులు అరెస్టు చేయగా.. తాజాగా ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డి సోదరుడు సందీప్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైశాలి, నవీన్ రెడ్డికి సంబంధించిన వీడియోలను వైరల్ చేస్తున్న కేసులో అతనిని అదుపులోకి తీసుకున్నారు.

గోవాలో నవీన్ రెడ్డి వీడియోలను రికార్డు చేసిన సందీప్ రెడ్డి, వంశీ భరత్ రెడ్డిలు వాటిని మీడియాకు పంపారు. ఇవి వైశాలి దృష్టికి వెళ్లడంతో ఆమె ఫిర్యాదు మేరకు సందీప్ రెడ్డి, వంశీ భరత్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మీడియాలో వైశాలికి సంబంధించిన వీడియోలను ప్రసారం చేయొద్దని పోలీసులు మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా వుండగా.. వైశాలి కిడ్నాప్ కేసులో ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. భాను ప్రకాశ్, సాయినాథ్, ప్రసాద్, హరి, విశ్వేశ్వర్‌లను ఒకరోజు కస్టడీకి అనుమతించింది ఇబ్రహీంపట్నం కోర్ట్.

మరోవైపు తన కొడుకు నవీన్‌ సేఫ్‌గా ఉంటాడా లేదా అన్నదానిపై నమ్మకం లేదన్నారు అతని తల్లి నారాయణమ్మ.ఎవరు మోసం చేశారో ఎవరి మోసపోయారో అందరికీ అర్థమౌతుందన్న ఆమె.. ఈ ఎపిసోడ్‌లో మోసపోయింది నవీనే అంటోంది.

వైశాలి కేవలం ఫ్రెండ్స్‌లా మాత్రమే ఉన్నామంటుంటోంది…మరి ఫ్రెండ్స్ లా ఉన్నవాళ్లు అంత దగ్గరగా ఫోటోలు ఎలా దిగరుతారని ప్రశ్నిస్తోంది నారాయణమ్మ. నవీన్ పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు ఒప్పుకోలేదని.. కానీ వాళ్ల నాన్న పెళ్ళికి ఒప్పుకున్నాడని నవీన్ వైశాలి కలిసి కేక్ కట్ చేశారని చెబుతోంది.

నవీన్ రెడ్డి-వైశాలి ఎపిసోడ్ ఇంకా కొలిక్కి రాలేదు. ఇద్దరి వాదనలు, ఆరోపణలు భిన్నంగా ఉన్నాయి. మొత్తంగా ఈ విషయంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం