AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రూ.400 కోసం ఇద్దరి మధ్య గొడవ.. చివరకు లారి కిందకు తోసేసి దారుణంగా..

చిన్న చిన్న విషయాలకే కొందరు దారుణానికి పాల్పడున్నారు. క్షణికావేశంలో కనికరం లేకుండా సాటి వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు.. సమాజంలో ఇలాంటి ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

Hyderabad: రూ.400 కోసం ఇద్దరి మధ్య గొడవ.. చివరకు లారి కిందకు తోసేసి దారుణంగా..
Money
Shaik Madar Saheb
|

Updated on: Dec 25, 2022 | 4:17 PM

Share

చిన్న చిన్న విషయాలకే కొందరు దారుణానికి పాల్పడున్నారు. క్షణికావేశంలో కనికరం లేకుండా సాటి వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు.. సమాజంలో ఇలాంటి ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా, హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రూ. 400ల కోసం.. ఇద్దరి మధ్య జరిగిన గొడవ.. ఒకరి హత్యకు దారితీసింది. రూ.400 కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవ.. ఘర్షణకు దారి తీసింది. దీంతో కోపోద్రికుడైన ఓ వ్యక్తి ఎదుటి వ్యక్తిని దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ బాలానగర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీరాం, శ్రీనివాస్‌ అనే వ్యక్తులు బాలానగర్‌లో కూలీలుగా పనిచేస్తున్నారు. రూ.400 విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. నర్సాపూర్ చౌరస్తా లోని ఫుత్‌పాత్‌ పై ఇద్దరు మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది.

ఈ క్రమంలో కాశీరాం.. శ్రీనివాస్‌పై కర్రతో దాడిచేశాడు. అనంతరం రోడ్డుపై అటుగా వెళుతున్న లారీ కిందకు శ్రీనివాస్‌ను తోసేశాడు. దీంతో అతను లారీ కింద పడి అక్కడికక్కడే మరణించాడు. ఇది చూసిన స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాశీరాంను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పట్టపగలే అందరూ చూస్తుండగా రోడ్డుపై జరిగిన ఈ హత్యతో ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఈ ఘటనకు కారణం రూ.400 లని పలువురు పేర్కొంటున్నారు. అయితే.. వీరిద్దరి మధ్య రూ.400 కోసం గొడవ జరిగిందా..? లేక ఇంకేమైన కారణం ఉందా..? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..