AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Child Love: తల్లి నుంచి బాలికను రక్షించడానికి కుక్క శతవిధాలా ప్రయత్నం.. మీ కల్మషంలేని ప్రేమ అద్భుతం అంటోన్న నెటిజన్లు

ఒక మహిళ తన కూతురికి ఏదో విషయంలో భయం చెప్పడానికి ప్రయత్నిస్తోంది. చేతి వేలి ఎత్తి.. అలా చేయవద్దు అంటూ చెబుతుంటే.. పక్క రూమ్ నుంచి ఓ కుక్క వచ్చింది. అంతే.. ఆ బాలిక దగ్గరకు వెళ్లి కౌగించుకుని తల్లి నుంచి రక్షణ ఇవ్వడానికి ప్రయత్నించింది.

Dog Child Love: తల్లి నుంచి బాలికను రక్షించడానికి కుక్క శతవిధాలా ప్రయత్నం.. మీ కల్మషంలేని ప్రేమ అద్భుతం అంటోన్న నెటిజన్లు
Dog Love Video Viral
Surya Kala
|

Updated on: Dec 26, 2022 | 9:05 PM

Share

మనిషికంటే కుక్క విశ్వాసం గలది అని అనేక సార్లు అనేక సంఘటనల ద్వారా తెలుస్తూనే ఉంది. తమ యజమాని పట్ల కుక్కలు చూపించే ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అందుకనే చాలామంది కుక్కలను ఇంటి సభ్యుల్లా భావించి ప్రేమిస్తారు.. తమ పిల్లలతో సమానం చూస్తారు. శునకం మనిషి కంటే ఏ విషయంలోనూ ఎందులోనూ తక్కువ కాదని నిరూపించే అనేక సంఘటనలు చూస్తూనే ఉన్నాం.. తరచుగా అనేక వీడియోల్లో తమకు పట్టెడన్నం పెట్టిన వ్యక్తుల పట్ల అవి చూపించే విధేయతను చూస్తున్నాం.. ఇక చిన్నారుల పట్ల కుక్కలు చూపించే ప్రేమ తల్లిదండ్రుల కంటే ఏ మాత్రం తక్కువ కాదు.. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి.

ఒక మహిళ తన కూతురికి ఏదో విషయంలో భయం చెప్పడానికి ప్రయత్నిస్తోంది. చేతి వేలి ఎత్తి.. అలా చేయవద్దు అంటూ చెబుతుంటే.. పక్క రూమ్ నుంచి ఓ కుక్క వచ్చింది. అంతే.. ఆ బాలిక దగ్గరకు వెళ్లి కౌగించుకుని తల్లి నుంచి రక్షణ ఇవ్వడానికి ప్రయత్నించింది. తల్లి కొడుతుంటే.. బాలికను రక్షించడానికి  కుక్క అడ్డుగా నిలిచిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ పెంపుడు కుక్క .. బాలిక మీద ఎనలేని ప్రేమని చూపిస్తోంది, అంతేకాదు.. నీకు నేను ఉండగా ఏమీ కాదు అన్నట్లు తల్లినుంచి సంరక్షణ ఇస్తున్న  వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంది.  వైరల్ అవుతున్న వీడియోలో తల్లి తన కూతురిని కొట్టడం, తిట్టడం గమనించిన కుక్క తన సోదరిని రక్షించడానికి  పరిగెడుతూ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇచ్చిన క్యాప్షన్‌లో, “సోదరి, నేను ఎల్లప్పుడూ మీ కోసం రక్షణగా నిలబడతాను అని ఉంది.

ఓ తల్లి తన కూతురిని బెదిరిస్తూ.. కొట్టడానికి ప్రయత్నిస్తోంది. అంతే తన ఫ్రెండ్ ను రక్షించడానికి రంగంలోకి దిగిన కుక్క.. తల్లికి బాలికకి మధ్య అడ్డుగా నిలబడింది. అయినప్పటికీ ఆ మహిళ.. తిట్టడం.. స్త్రీ కొట్టిన దెబ్బ నుండి బాలికను రక్షించడానికి.. తాను మోసపోతున్నానని తెలియని కుక్క.. ఆ మహిళ నుంచి బాలికను రక్షించడానికి తన సాయశక్తులా ప్రయత్నించింది.  అమ్మాయిని కొట్టకుండా ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కుక్క చివరికి తల్లి తన కూతుర్ని కొట్టకుండా ఆపుతుంది.

ఇంటర్నెట్‌లో ప్రజలు కుక్క ప్రయత్నాన్ని ప్రశంసించారు

ఇప్పటి వరకు ఈ  వీడియోకు 25 వేలకు పైగా వీక్షణలు..  వందల కొద్దీ లైక్‌లు, కామెంట్‌లు వచ్చాయి.  “స్వచ్ఛమైన ప్రేమ,  పిల్లలిద్దరూ అమాయకులు, ఆ బాలికను ఆ బుజ్జి కుక్క ఎంతగా ప్రేమిస్తుందో.. అందమైన హృదయం.. కల్మషం లేని ప్రేమ.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోకి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..