తీవ్రమైన తలనొప్పి, కళ్లల్లో మంటతో ఆసుపత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసిన వైద్యులకు మైండ్ బ్లాంక్!

ఇదో షాకింగ్ ఘటన. సాధారణంగా అందరి కళ్లల్లో నుంచి నీరు కారుతాయి. కానీ ఇక్కడొక మహిళకు ఏకంగా కంటిలో నుంచి రాళ్లు పడుతున్నాయి.

తీవ్రమైన తలనొప్పి, కళ్లల్లో మంటతో ఆసుపత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసిన వైద్యులకు మైండ్ బ్లాంక్!
Stone From Eyes
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 26, 2022 | 8:21 PM

ఇదో షాకింగ్ ఘటన. సాధారణంగా అందరి కళ్లల్లో నుంచి నీరు కారుతాయి. కానీ ఇక్కడొక మహిళకు ఏకంగా కంటిలో నుంచి రాళ్లు పడుతున్నాయి. వినడానికి మీకు షాకింగ్‌గా ఉన్నా.. ఇది నిజం. ఈ ఘటన కర్ణాటకలోని హున్సూరు తాలూకాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళ గత కొద్దిరోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోంది. అనంతరం ఆమె కళ్లల్లో మంటలు, దురద రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె కంటి నుంచి రాళ్లు పడటం ప్రారంభమయ్యాయి. ఇప్పటికి దాదాపు 200 రాళ్లు సదరు మహిళ కంట్లో నుంచి పడినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైద్యులు కూడా ఇందుకు గల కారణాన్ని చెప్పలేకపోయారని తెలిపారు. ఇలాంటి కేసును ఇంతవరకు చూడలేదని.. ఇదొక అరుదైన వ్యాధి ఏమోనని అనుకుంటున్నట్లు వైద్యులు చెప్పారట. అసలు ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకునేందుకు నగరంలోని పెద్దాసుపత్రికి స్థానిక డాక్టర్లు సిఫార్సు చేసినట్లు సదరు మహిళ కుటుంబ సభ్యులు వెల్లడించారు.

కాగా, తెలంగాణలో కూడా కొద్దినెలల క్రితం ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. గద్వాల్ జిల్లాకు చెందిన దీపాలి అనే అమ్మాయి కంట్లో నుంచి బియ్యపు గింజలు, రాళ్లు వచ్చాయి. ఆమెను కర్నూల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అక్కడి డాక్టర్లు పలు వైద్య పరీక్షలు నిర్వహించినా.. సదరు యువతి కంట్లో నుంచి అలా ఎందుకు వస్తున్నాయన్న దానికి గల కారణాన్ని చెప్పలేకపోయారు.