Viral Video: మీ సేవలు అసమాన్యం అద్భుతం అద్వితీయం.. సలామ్ సైనికా.. నీ సహనానికి పాదాభివందనం..
ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని భారత దేశానికి చెల్లించబడే బ్లాంక్ చెక్కు వంటి వాడు. తాను బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు.. దేశరక్షణ కోసం సైనికులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడతారు. ఎంతటి కఠిన పరిస్థితిలోనైనా ధైర్యంగా ముందుకు సాగుతారు.
దేశ రక్షణ కోసం.. తన కుటుంబాన్ని సంతోషాన్ని సరదాలను విడిచి.. మంచు గడ్డలలో.. నిప్పుల కొలిమిలా ఉండే ఎడారిలో.. కాకులు దూరని చిట్టడవుల్లో.. క్రూర మృగాలతో.. నేల..నింగి..నీరులో పోరాడుతూ.. దేశ సరిహద్దులలోన నిలిచి.. ప్రాణాలకు తెగించి పోరాడేవారే సైనికులు.. తమ ప్రాణాలని విడిచి.. మరణానికి కూడా అర్ధాన్ని చెప్పి అనందించేవాడు జవాన్.. అవును ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని భారత దేశానికి చెల్లించబడే బ్లాంక్ చెక్కు వంటి వాడు. తాను బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు.. దేశరక్షణ కోసం సైనికులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడతారు. ఎంతటి కఠిన పరిస్థితిలోనైనా ధైర్యంగా ముందుకు సాగుతారు.
విధి నిర్వహణలో ఎండ, వాన, చలి, ఆకలి ఏవీ వారి దరిచేరవు. ఇలా తన విధులు నిర్వర్తిస్తున్న ఓ సైనికుడి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ సైనికుడు విధి నిర్వహణలో ఉండగా తొడలోతు మంచులో ఇరుక్కుపోయాడు. అతను బయటకు రావడానికి చాలా కష్టపడ్డాడు. ఓ చేతిలో తుపాకి ఉంది. అది కింద పెడితే ఎక్కడ గడ్డకట్టుకుపోతుందోనని చేత్తోనే పట్టుకున్నాడు. ఒంటిచేత్తో మంచు తొలగించడం కష్టంగా మారింది. చివరకు తన చేతిలో ఉన్న తుపాకీని ఇంకొకరికి ఇచ్చి మంచులో నుండి బయటపడి తన దారిలో సాగిపోయాడు. మంచులో ఇబ్బంది పడుతున్నంత సేపు అతనిలో ఎలాంటి చిరాకు, అసహనం, బాధ లాంటివి కనిపించలేదు.
Notice the smile on face of this young soldier ?? pic.twitter.com/emejbSmbNP
— Maj Gen Raju Chauhan, VSM (veteran)?? (@SoldierNationF1) December 25, 2022
చిరునవ్వుతోనే అతను ఆ మంచు నుండి బయటపడ్డాడు. మేజర్ జనరల్ రాజు చౌహాన్ వీడియో షేర్ చేస్తూ ఆ సైనికుడి ముఖంలో చిరునవ్వు చూడండి అనే క్యాప్షన్ జతచేశారు. ఈ వీడియో చూసిన వేలాదిమంది మన దేశ సైనికుల కర్తవ్య దీక్ష చాలా గొప్పదని ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..