Viral: ‘ఛీ.. యాక్‌..! ఎవడ్రా.. జిలేబీతో మసాలా కూర వండింది..’ నెట్టింట వైరల్‌ అవుతోన్న కొత్త వంటకం

జిలేబీ అంటే మీకు ఇష్టమా? ఏం మాట్లాడుతున్నారండీ.. జిలేబీ అంటే ఇష్టపడని వారెవరైనా ఉంటారా? అని అనుకుంటున్నారా.. ఐతే మీకు ఈ జిలేబీ గురించి తప్పక చెప్పాల్సిందే. ఆ తర్వాత కూడా జిలేబీ ఇష్టమేనని అన్నారంటే మీరు గ్రేటే! ఎందుకంటే..

Viral: 'ఛీ.. యాక్‌..! ఎవడ్రా.. జిలేబీతో మసాలా కూర వండింది..' నెట్టింట వైరల్‌ అవుతోన్న కొత్త వంటకం
Masala Jalebi
Follow us

|

Updated on: Dec 27, 2022 | 7:23 PM

జిలేబీ అంటే మీకు ఇష్టమా? ఏం మాట్లాడుతున్నారండీ.. జిలేబీ అంటే ఇష్టపడని వారెవరైనా ఉంటారా? అని అనుకుంటున్నారా.. ఐతే మీకు ఈ జిలేబీ గురించి తప్పక చెప్పాల్సిందే. ఆ తర్వాత కూడా జిలేబీ ఇష్టమేనని అన్నారంటే మీరు గ్రేటే! ఎందుకంటే.. ఈ జిలేజీ రుచి చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయంతే.. ప్రస్తుతం నెట్టింట వణుకు పుట్టిస్తున్న వంటకం కూడా ఇదే. ఇంకెందుకు ఆలస్యం విషయంలోకి వెళ్దాం పదండి..

సాధారణంగా జిలేబీ నోట్లో వేసుకుంటే తీయ్యగా.. కమ్మగా.. ఎంతో మధురంగా ఉంటుంది. అలా ఒక్కోట్టి తింటూ ఉంటే ఎన్ని తింటున్నామో లెక్కే ఉండదు. జిలేబీ తియ్యగా కాకుండా కాస్త కారంగా.. ఉప్పగా.. ఘటాగా ఉంటే..ఎలా ఉంటుంది? వెరైటీగా ఉంటుందని ఓ నలభీముడు మసాలా జిలేబీ వండేశాడు. అంతటితో ఊరుకోకుండా దాన్ని ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అంతే.. జిలేబీ ప్రియులంతా ఒక్కసారిగా మండిపడుతున్నారు. బాబోయ్‌..ఇదేం వంటకం! అని అంటున్నారు. మయూర్ సెజ్‌పాల్ అనే యూజర్‌ పేరుతో ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఈ ఫొటో చూస్తుంటే ఆకలి చచ్చిపోతుంది? అని ఒకరు, ఛీ.. యాక్‌ అని కోపంతో ఉన్న ఎమోజీలు మరికొందరు కామెంట్ సెక్షన్‌ పెడుతున్నారు. జిలేబీ అనేది స్నాక్స్‌. వాటితో ప్రయోగాలు చేయడం మానేసి, బుద్ధిగా ఎలా తినాలో అలాగే తినమని హితబోధ చేశారు మరికొందరు. మరి మీరే మంటారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి