AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కార్‌ను ఇలా కూడా డిజైన్ చేస్తారా..? ‘చేసినవాడెవడో కానీ మహానుభావుడే’ అంటున్న నెటిజన్లు..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కారు లేదా వెహికిల్ మోడల్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. అంటే వెహికిల్ రూపురేఖలు దేనివి దానికే ఉన్నా టైర్స్ మాత్రం కిందే ఉంటాయి కదా.. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపించిన ఒక కారు ఇందుకు పూర్తి..

Watch Video: కార్‌ను ఇలా కూడా డిజైన్ చేస్తారా..? ‘చేసినవాడెవడో కానీ మహానుభావుడే’ అంటున్న నెటిజన్లు..
Upside Down Designed Car
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 28, 2022 | 7:54 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కారు లేదా వెహికిల్ మోడల్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. అంటే వెహికిల్ రూపురేఖలు దేనివి దానికే ఉన్నా టైర్స్ మాత్రం కిందే ఉంటాయి కదా.. మహా అయితే డిజైన్ లేదా స్పేర్ కోసం కొన్ని వాహనాల వెనుక కూడా ఒక టైర్ అమర్చి ఉంటుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపించిన ఒక కారు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. కస్టమర్లకు నచ్చేలా కొత్త కొత్త డిజైన్లతో వెహికిల్ కంపెనీలు కూడా ప్రయత్నాలు చేస్తుంటాయి. మరి ఇది ఎలాంటి ప్రయత్నమో తెలియక నెటిజన్లు తలపట్టుకుంటున్నారు. ఇక ఆ కారుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అయితే ఆ కారుకు కూడా సాధారణ కార్లు లాగానే డోర్స్, విండోస్, హెడ్‌లైట్లు, నంబర్ ప్లేట్లు ఉన్నాయి. టైర్స్ మాత్రమే పైకి ఉన్నాయి. తలకిందులుగా ఉన్న ఈ కారు వీడియో ‘లాన్స్ @Lance’ అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయింది. కొత్తగా, వింతగా ఉన్న ఈ కారుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు బాగానే ఇష్టపడుతున్నారు. పోస్ట్ అయినప్పటి నుంచి ఈ వీడియోకు దాదాపు 30 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అలాగే సుమారు లక్ష 65 వేల మంది ఈ వీడియోను ఇష్టపడ్డారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న కార్ వీడియో..

కాగా, నెటిజన్లు కూడా వింత వింతగా.. హస్యాస్పదంగా కామెంట్  చేస్తున్నారు. వారిలో ఒక నెటిజన్ ‘నేను చాలా గందరగోళంగా ఉన్నాను. ఇది హాస్యాస్పదంగా కూడా లేదు’ అని కామెంట్ చేయగా, మరొ నెటిజన్ ‘ప్రజలు నిజంగా వారి జీవితాలను వారు కోరుకున్న విధంగా జీవిస్తున్నారు. నాకు అది నచ్చింద’ని రాసుకొచ్చాడు. అదే క్రమంలో ఇంకో నెెటిజన్ ‘కార్ డిజైన్ చేసినవాడెవడో కానీ మహానుభావుడే’ అని రిప్లై ఇచ్చాడు. ఇలా నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం క్లిక్ చేయండి..