Benefits of Peanuts: వేరుశెనగలతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే తినకుండా ఉండలేరు..

Benefits of Peanuts: ఆరోగ్యమే మహ భాగ్యమని మన పెద్దలు పదే పదే చెప్పడాన్ని మనం వినే ఉంటాం. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని ప్రధానంగా ప్రభావితం చేస్తుంది. మరి అందుకోసం ఏం తినాలి, ఏం తినకూడదు అనే అంశంపై సరైన అవగాహన ఉండడం మంచిది.ఇందుకోసం మనం కొలెస్ట్రాల్‌ పెంచే అహారాలను తక్కువగా, కొలెస్ట్రాల్ లేనివాటిని ఎక్కువగా తినాలి. మైదా, పామాయిల్ వంటి వాటితో కొలెస్ట్రాల్ తయారవుతుంది కాబట్టి వాటిని తగ్గించేయాలి. వేరుశెనగ వంటి వాటితో కొలెస్ట్రాల్ సమస్య ఎదురవ్వదు కాబట్టి వీటిని తీసుకోవచ్చు. మరి వేరుశెనగలు మన ఆరోగ్యానికి ఏ మేరకు ఉపకరిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Dec 28, 2022 | 5:52 PM

వేరుశనగల్ని ఉడకబెట్టుకొని, వేపుకొని లేదా పచ్చిగా.. ఎలాగైనా తినవచ్చు. శరీరంలో మంచి కొవ్వును పెంచి.. చలి నుంచి కాపాడడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. చాలా మంది వేరుశనగలు తినేందుకు భయపడతారు. వాటిలో నూనె ఉంటుందనీ.. బరువు పెరిగిపోతామనీ అనుకుంటారు. కానీ ప్రతిరోజూ ఒక గుప్పెడు వేరు శెనగలను తింటే శరీరానికి ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 6
వేరుశెనగ గింజల్లో కేలరీలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ఫైబర్, ఒమేగా6 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్, మెగ్నీషియం వంటి అనేక రకాల పోషకాలు అధికంగా ఉంటాయి.  శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ప్రమాదం. వేరుశెనగలను తినడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరగదు. అందువల్ల వీటిని తినడం వల్ల ఎటువంటి హాని ఉండదు.

2 / 6
 వేరుశెనగలలో ప్రొటీన్లు, పీచు(Fiber) పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల.. కొన్ని గింజలు తినగానే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అది చాలాసేపు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు మరింత ఆహారం తీసుకోరు. తద్వారా బరువు పెరిగే అవకాశం ఉండదు. జంక్ ఫుడ్ కంటే వేరుశెనగ వంటి గింజల్ని మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఎందుకంటే ఇవి చాలా రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి.

3 / 6
వేరుశెనగలో ప్రోటీన్ ఎక్కువగా ఉన్నందున ఇది శరీర వేడిని పెంచి.. చెడు కొవ్వును కరిగించి.. బరువు తగ్గేలా చేస్తుంది. రోజూ వేరుశెనగల్ని తీసుకుంటే కండరాలు దృఢంగా ఉంటాయి. వేరుశెనగలు మన కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. స్పష్టమైన దృష్టికి అవసరమైన విటమిన్ ఏను వేరుశెనగలో ఉండే జింక్ అందిస్తుంది. ఇందులోని విటమిన్ ఈ కంటిశుక్లం, వయసు పెరిగేటప్పుడు వచ్చే మచ్చల నుంచి రక్షిస్తుంది.

4 / 6
 వేరుశెనగను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఈ విషయం చాలా అధ్యయనాల్లో రుజువైంది కూడా. వేరుశెనగలో మెగ్నీషియం, కాపర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. వేరుశెనగలో మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నందున ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ధమనుల లోపలి పొరలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గితే.. గుండెకు మంచిది.

5 / 6
 వేరుశెనగ క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో వచ్చే డ్రై స్కిన్ సమస్య కూడా దూరమవుతుంది. మీరు చర్మానికి వేరుశెనగ నూనెను కూడా రాసుకోవచ్చు. ఇందులో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చర్మంలోని మచ్చలను తగ్గిస్తాయి. ముడతలు, ఫైన్ లైన్‌లు, డార్క్ స్పాట్‌లను తొలగిస్తాయి. ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యల్ని వేరుశెనగ గింజలు నయం చేస్తాయి.

6 / 6
Follow us