AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: బరువు పెరుగుతామేమోనని భయపడుతున్నారా..? ఈ 3 చిట్కాలను పాటిస్తే చాలు.. సమస్య మీ దరికి రానే రాదు..

ప్రస్తుత కాలంలో చాలా మందిలో అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా కోవిడ్ వ్యాప్తి తరువాత చాలా మందిలో దైనందిన జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లలలో కూడా

Health Tips: బరువు పెరుగుతామేమోనని భయపడుతున్నారా..? ఈ 3 చిట్కాలను పాటిస్తే చాలు.. సమస్య మీ దరికి రానే రాదు..
Weight Gain Tips
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 28, 2022 | 6:39 PM

Share

ప్రస్తుత కాలంలో చాలా మందిలో అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా కోవిడ్ వ్యాప్తి తరువాత చాలా మందిలో దైనందిన జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లలలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఇంటికే పరిమితమవడంతో శారీరక శ్రమ లేకుండా పోయింది. కూర్చున్న చోటే ఎక్కు వ సమయం గడపటం వల్ల స్ధూలకాయం, అధిక బరువు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక బరువు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. అంతేకాక అధిక బరువు కారణంగా మహిళల్లో గర్భధారణ సమస్యలు, ఇన్ఫెర్టిలిటీ వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.

అయితే బరువు తగ్గాలనుకునేవారు కొన్ని రకాల ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఇంకా చెప్పుకోవాలంటే జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకుంటే రానున్న కాలంలో బరువు పెరగకుండా ఉంటారు. ఇందుకోసం మీరు కేవలం బరువు తగ్గడం మీద దృష్టి పెట్టకుండా, తగ్గిన బరువును తిరిగి పెరగకుండా అదుపులో ఉంచుకోవడానికి కూడా ప్రయత్నించడం మంచిది. అందుకోసం మీకు ఉపయోగపడే మూడు ఆరోగ్య చిట్కాలను పాటించడం వల్ల మేలు జరుగుతుందని  ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

జీవన విధానంలో మార్పులు:

బరువు పెరగకుండా ఉండేందుకు మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. నిత్యం పోషకాలతో ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలా చేయడం వల్ల శరీరానికి కావలసిన మొత్తంలో శక్తి అందుతుంది. అలా కాకుండా నాణ్యత లేదా పోషకాలు లేని ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి.

ఇవి కూడా చదవండి

రోజువారీ వ్యాయామాలు:

అధిక బరువు అనేది చాలా మందిలో ఉన్న సాధారణ సమస్యే. బరువు తగ్గడం కోసం వ్యాయమాలు చేసేవారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే కొంతమంది బరువు తగ్గాలన్న ఆలోచనతో చాలా సమయం వ్యాయామాలకే కేటాయిస్తుంటారు. ఇలా చేయటం వల్ల గుండె, ఊపిరితిత్తుల వంటి ప్రధాన అవయవాలపై ఒత్తిడి పడుతుంది. అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. వాటికి బదులుగా తేలికపాటి వ్యాయామాలు అంటే నడక, జాగింగ్, సైక్లింగ్ వంటి వాటిని చేయాలి. క్రమం తప్పకుండా వీటిని చేయడం వల్ల కేవలం క్యాలరీలు కరగడమే కాక, శారీరక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. తద్వారా సులభంగా బరువు తగ్గేందుకు వ్యాయామాలు తోడ్పడతాయి.

ప్రశాంతమైన నిద్ర:

అభివృద్ధి చెందిన ఫీచర్లతో వస్తున్న ఫోన్ల మాయలో పడి చాలా మంది సరిగా నిద్రపోవడంలేదు. కంటికి సరిపడా నిద్రలేకపోతే అది మన శారీరక, మానసిక ఒత్తిడికి కారణమవుతుంది.  నిద్రలేమి శరీరంపై దుష్పప్రభావాలను చూపడమే కాక శరీర బరువు పెరిగేలా చేస్తుంది. నిద్రకు మనమిచ్చే సమయం తగ్గే కొద్ది అరోగ్య సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. అందువల్ల కనీసం 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  అలాగే తీసుకున్న ఆహారంలోని పోషకాలు శరీరమంతటా ప్రసరించడానికి నీటి కొరత ఏర్పడకుండా చూసుకోవాలని అంటున్నారు. అందుకోసం సరిపడినంత స్థాయిలో నీటిని తాగాలని వారు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రానున్న కాలంలో బరువు పెరిగే అవకాశం ఉండదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..